ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

North Andhra: ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ..

ABN, Publish Date - Mar 04 , 2025 | 04:20 AM

ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా పీఆర్‌టీయూ అభ్యర్థి గాదె శ్రీనివాసులునాయుడు విజయం సాధించారు.

  • ద్వితీయ ప్రాధాన్య ఓట్లతో రఘువర్మపై గెలుపు

  • పీఆర్‌టీయూ అభ్యర్థి గాదె విజయం

  • శ్రీనివాసులునాయుడు ఎన్నికవడం మూడోసారి

విశాఖపట్నం, మార్చి 3 (ఆంధ్రజ్యోతి): ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా పీఆర్‌టీయూ అభ్యర్థి గాదె శ్రీనివాసులునాయుడు విజయం సాధించారు. ఆయన రెండో ప్రాధాన్య ఓట్లతో గెలుపొందారు. ఆంధ్ర విశ్వవిద్యాలయంలో సోమవారం ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు మొదలైంది. గత నెల 27న జరిగిన పోలింగ్‌లో 20,794 ఓట్లు పోలవ్వగా.. అందులో 659 చెల్లనవిగా గుర్తించారు. మిగిలిన 20,135 ఓట్లలో 50 శాతం కంటే ఒక ఓటు అదనంగా సాధించిన వారిని విజేతగా ప్రకటించాల్సి ఉంటుంది. అంటే 10,068 ఓట్లు రావాలి. అయితే తొలి ప్రాధాన్య ఓట్లలో శ్రీనివాసులునాయుడికి 7,210, ఏపీటీఎఫ్‌ అభ్యర్థి పాకలపాటి రఘువర్మకు 6,845, యూటీఎఫ్‌ అభ్యర్థి కోరెడ్ల విజయగౌరికి 5,804 ఓట్లు లభించాయి. పోటీలో ఉన్న మిగిలిన ఏడుగురు అభ్యర్థులకు వంద కంటే తక్కువ ఓట్లు వచ్చాయి. విజయానికి అవసరమైన 10,068 ఓట్లు ఎవరికీ లభించకపోవడంతో అధికారులు రెండో ప్రాధాన్య ఓట్ల లెక్కింపును చేపట్టారు. ఈ క్రమంలో తొలుత ఏడుగురు అభ్యర్థులను ఎలిమినేట్‌ చేశారు. అప్పటికీ మ్యాజిక్‌ ఫిగర్‌కు ఎవరూ చేరుకోకపోవడంతో మూడో స్థానంలో నిలిచిన విజయగౌరికి వచ్చిన ఓట్ల నుంచి రెండో ప్రాధాన్య ఓట్లను లెక్కించగా.. శ్రీనివాసులునాయుడికి 9,237 ఓట్లు, వర్మకు 8,527 ఓట్లు లభించాయి. ఇంకా శ్రీనివాసులునాయుడి ఎన్నికకు 831 ఓట్లు అవసరమయ్యాయి. దీంతో రెండో స్థానంలో నిలిచిన రఘువర్మకు లభించిన ఓట్ల నుంచి రెండో ప్రాధాన్య ఓట్లను లెక్కించారు. దీంతో మ్యాజిక్‌ ఫిగర్‌కు అవసరమైన 10,068 ఓట్లు రావడంతో శ్రీనివాసులునాయుడిని విజేతగా ప్రకటించారు. ఆయన 2007, 13లో కూడా ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా విజయం సాధించారు.

Updated Date - Mar 04 , 2025 | 04:21 AM