ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Health Sector: ఆరోగ్యశాఖను అప్పుల్లోకి నెట్టారు

ABN, Publish Date - Mar 08 , 2025 | 05:49 AM

తాను రూ.6,500 కోట్ల అప్పులతో ఆరోగ్యశాఖ మంత్రిగా బాధ్యతలు తీసుకున్నానని చెప్పారు. శుక్రవారం అసెంబ్లీలో వైద్యఆరోగ్య శాఖపై చర్చ సందర్భంగా మంత్రి మాట్లాడారు. నెట్‌వర్క్‌ ఆస్పత్రులకు, మందుల సరఫరా చేసిన కాంట్రాక్టర్లకు..

రూ.6,500 కోట్లు అప్పులు చూపించారు

వైసీపీ ప్రభుత్వం మందులకూ బకాయి పెట్టింది

ఆరోగ్య శాఖను పూర్తిగా గాడిలో పెట్టాం..

అసెంబ్లీలో మంత్రి సత్యకుమార్‌

అమరావతి, మార్చి 7 (ఆంధ్రజ్యోతి): ఆరోగ్యశాఖ సేవా రంగమని, ఖర్చు పెట్టడమే కానీ ఆదాయం వచ్చేది ఉండదని... అలాంటి ఆరోగ్యశాఖను కూడా గత వైసీపీ ప్రభుత్వం అప్పులపాలు చేసిందని ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్‌ అన్నారు. తాను రూ.6,500 కోట్ల అప్పులతో ఆరోగ్యశాఖ మంత్రిగా బాధ్యతలు తీసుకున్నానని చెప్పారు. శుక్రవారం అసెంబ్లీలో వైద్యఆరోగ్య శాఖపై చర్చ సందర్భంగా మంత్రి మాట్లాడారు. నెట్‌వర్క్‌ ఆస్పత్రులకు, మందుల సరఫరా చేసిన కాంట్రాక్టర్లకు.. ఇలా ప్రతి విభాగాన్నీ వైసీపీ అప్పుల్లో ముంచేసిందని ఆరోపించారు. కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే సీఎం చంద్రబాబు ఆరోగ్యశాఖకు రూ.2700 కోట్లు మూలధన వ్యయం కింద ఇచ్చారని చెప్పారు. 2025-26 బడ్జెట్‌లో ఆరోగ్యశాఖకు రూ.19,264 కోట్లు కేటాయించడం అభినందనీయమని, ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) నిబంధనల ప్రకారం ఏ దేశం, రాష్ట్రంలోనైనా జీడీపీ లేదా జీఎ్‌సడీపీలో 6 శాతం నిధులు ప్రజారోగ్యానికి కేటాయించాలని, అప్పుడే ఆరోగ్య వ్యవస్థ పటిష్టమవుతుందని మంత్రి చెప్పారు. స్వర్ణాంధ్ర-2047 సాకారం కావాలంటే రాబోయే రోజుల్లో ఆరోగ్యశాఖకు బడ్జెట్‌ పెంచాలని కోరారు. ఈ తొమ్మిది నెలల్లో ఆరోగ్యశాఖ ద్వారా అనేక కార్యక్రమాలు చేపట్టామని వివరించారు.


గిరిజన ప్రాంతాలైన బుట్టాయిగూడెం, పార్వతీపురం, రంపచోడవరం, పార్వతీపురం, డోర్నాల ప్రాంతాల్లో రూ.250 కోట్లు వ్యయంతో ఐదు మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రుల నిర్మాణం చేపడుతున్నామని చెప్పారు. మాజీ సీఎం జగన్‌ రాష్ట్రంలో 4 శాతం మాత్రమే స్పెషలి్‌స్టల కొరత ఉందని అన్నారని, వాస్తవానికి రాష్ట్రంలో 26 శాతం వైద్య సిబ్బంది కొరత ఉందని చెప్పారు. వైసీపీ ప్రభుత్వం మందులకు రూ.1000 కోట్లు బకాయిలు పెట్టిందని, వాటిని చెల్లిస్తేనే తాము మందులు సరఫరా చేస్తామని సరఫరాదారులు చేతులెత్తేశారని చెప్పారు. దీంతో రూ.750 కోట్లు మందులకు విడుదల చేశామని, ఇప్పుడు ఆస్పత్రుల్లో మందులు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. ఆరోగ్యశాఖను పూర్తిగా గాడిలో పెట్టామని వెల్లడించారు. అంతకుముందు సభలో సభ్యులు మాట్లాడారు. విశాఖపట్నంలో కొన్ని ప్రైవేటు ఆస్పత్రులు అధిక ధరలతో ప్రజలను దోపిడీ చేస్తున్నాయని బీజేఎల్పీ నేత విష్ణుకుమార్‌రాజు ఆరోపించారు.


ఇవి కూడా చదవండి...

Also Read: వేయించిన తెల్ల నువ్వులు, బెల్లం కలిపి తీసుకుంటే ఇన్ని ప్రయోజనాలా..

Also Read: తమిళనాడు సీఎం ఏంకే స్టాలిన్ కీలక నిర్ణయం.. సీఎంలకు లేఖ

Also Read: పోసానికి గుడ్ న్యూస్ కానీ.. జైల్లోనే..

Also Read : రంగయ్య మృతి.. సీఎం చంద్రబాబు సంచలన నిర్ణయం

మరిన్ని ఏపీ వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - Mar 08 , 2025 | 05:49 AM