ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Andhra Pradesh: జగన్‌ జమానాలో భారీ ‘ఫ్రీ హోల్డ్‌’ స్కాం

ABN, Publish Date - Mar 08 , 2025 | 05:51 AM

జీవో వస్తుందని చెప్పి ఎన్నికలకు ఆరు నెలల ముందు తమ అనుయాయుల ద్వారా ముందుగానే ఇన్‌సైడ్‌ ట్రేడింగ్‌ చేశారని తెలిపారు. శుక్రవారం శాసనమండలిలో సభ్యుల ప్రశ్నలకు ఆయన సమాధానమిచ్చారు.

8,452 ఎకరాల అక్రమ రిజిస్ట్రేషన్‌: అనగాని

అమరావతి, మార్చి 7(ఆంధ్రజ్యోతి): జగన్‌ ప్రభుత్వ హయాంలో ఫ్రీ హోల్డ్‌ పేరిట భారీ కుంభకోణం జరిగిందని రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్‌ విమర్శించారు. జీవో వస్తుందని చెప్పి ఎన్నికలకు ఆరు నెలల ముందు తమ అనుయాయుల ద్వారా ముందుగానే ఇన్‌సైడ్‌ ట్రేడింగ్‌ చేశారని తెలిపారు. శుక్రవారం శాసనమండలిలో సభ్యుల ప్రశ్నలకు ఆయన సమాధానమిచ్చారు. ‘జగన్‌ సర్కారు రాష్ట్రవ్యాప్తంగా 13 లక్షల 59 వేల ఎకరాలను ఫ్రీ హోల్డ్‌ చేసింది. వాటిలో 11 లక్షల 56 వేల ఎకరాల్లో రీ వెరిఫికేషన్‌ పూర్తయింది. ఇందులో 5 లక్షల 8 వేల ఎకరాలను నిబంధనలకు విరుద్ధంగా ఫ్రీహోల్డ్‌ చేశారు. వాటిలో 25,214 ఎకరాల రిజిస్ట్రేషన్‌ జరిగింది. అందులో 8,452 ఎకరాలు నిబంధనలకు విరుద్ధంగా రిజిస్టర్‌ అయ్యాయి. ఫ్రీ హోల్డ్‌, 22 ఏలో చేసిన అక్రమాలన్నింటిపైనా విచారణ జరుగుతుంది. వాటికి సంబంధించిన సమస్యలన్నీ సత్వరమే పరిష్కరిస్తాం’ అని వెల్లడించారు. టీడీపీ ఎమ్మెల్సీ దువ్వారపు రామారావు మాట్లాడుతూ.. తన ఇంటినీ 22ఏ జాబితాలో పెట్టారని, ఆ ఇంటిపై బ్యాంకులో రుణం కూడా తీసుకున్నామని.. ఆయినా కక్షకట్టి కావాలని 22ఏలో పెట్టారని చెప్పారు.


జిల్లాల పునర్వ్యవస్థీకరణకు సంబంధించి ప్రస్తుతానికి ఎటువంటి ప్రతిపాదనలు లేవన్నారు. బాపట్ల జిల్లాలోని బాపట్ల, చీరాల, రేపల్లె రెవెన్యూ డివిజన్లను సవరించి.. అద్దంకి కేంద్రంగా కొత్త రెవెన్యూ డివిజన్‌ ఏర్పాటుకు ఆ జిల్లా కలెక్టర్‌ నుంచి ప్రతిపాదనలు వచ్చాయని చెప్పారు. అదేవిధంగా శ్రీసత్యసాయి జిల్లా మడకశిరను రెవెన్యూ డివిజన్‌గా మార్చాలంటూ ఆ జిల్లా కలెక్టర్‌ నుంచి కూడా నివేదిక వచ్చిందన్నారు. ఎమ్మిగనూరు, ఉదయగిరి కేంద్రాలను రెవెన్యూ డివిజన్లుగా మార్చాలని స్థానిక ఎమ్మెల్యేల నుంచి ప్రతిపాదనలు అందాయని తెలిపారు.


ఇవి కూడా చదవండి...

Also Read: వేయించిన తెల్ల నువ్వులు, బెల్లం కలిపి తీసుకుంటే ఇన్ని ప్రయోజనాలా..

Also Read: తమిళనాడు సీఎం ఏంకే స్టాలిన్ కీలక నిర్ణయం.. సీఎంలకు లేఖ

Also Read: పోసానికి గుడ్ న్యూస్ కానీ.. జైల్లోనే..

Also Read : రంగయ్య మృతి.. సీఎం చంద్రబాబు సంచలన నిర్ణయం

మరిన్ని ఏపీ వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - Mar 08 , 2025 | 05:51 AM