Kurnool : యువకుడి వైద్యానికి మంత్రి లోకేశ్ భరోసా
ABN, Publish Date - Feb 17 , 2025 | 04:32 AM
బాధితుడి సమస్యను ఓ టీడీపీ కార్యకర్త ‘ఎక్స్’ ద్వారా లోకేశ్ దృష్టికి తీసుకెళ్లారు. కర్నూలు నగరం గడ్డ స్ట్రీట్‌కు చెందిన పి.నవాస్ ఖాన్ కిడ్నీ సమస్యతో బాధపడుతున్నాడు.
‘ఎక్స్’లో పోస్టుకు స్పందన
కర్నూలు న్యూసిటీ, ఫిబ్రవరి 16(ఆంధ్రజ్యోతి): అనారోగ్యంతో బాధపడుతున్న ఓ యువకుడి వైద్యానికి మంత్రి లోకేశ్ భరోసా ఇచ్చారు. బాధితుడి సమస్యను ఓ టీడీపీ కార్యకర్త ‘ఎక్స్’ ద్వారా లోకేశ్ దృష్టికి తీసుకెళ్లారు. కర్నూలు నగరం గడ్డ స్ట్రీట్‌కు చెందిన పి.నవాస్ ఖాన్ కిడ్నీ సమస్యతో బాధపడుతున్నాడు. అతడి కిడ్నీ పాడైపోయిందని హైదరాబాద్‌లోని కిమ్స్ ఆస్పత్రి వైద్యులు నిర్ధారించగా, కొడుక్కి తన కిడ్నీ ఇవ్వడానికి తండ్రి సిద్ధమయ్యారు. ఈ చికిత్సకు రూ.13 లక్షలు, అనంతరం 6నెలల పాటు ఇంజెక్షన్లు, మందులు, తదితర వాటికి మరో రూ.12 లక్షలు ఖర్చవుతుందని వైద్యులు చెప్పారు. ఆర్థిక స్తోమత లేకపోవడంతో మంత్రి దృష్టికి తీసుకెళ్లగా.. లోకేశ్ కార్యాలయం నుంచి ఆదివారం నవాస్ ఖాన్‌కు ఫోన్ వచ్చింది. ప్రభుత్వం నుంచి రూ.3లక్షల నుంచి రూ.4లక్షల వరకు ఆర్థికసాయం అందిస్తుందని, వివరాలు పంపాలని కోరారు. దీంతో లోకేశ్‌కు బాధిత కుటుంబం కృతజ్ఞతలు తెలిపింది.
Updated Date - Feb 17 , 2025 | 04:32 AM