ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Minister Achchen Naidu : ‘సూపర్‌ సిక్స్‌’ అమలు చేశాకే ప్రజల్లోకి

ABN, Publish Date - Jan 04 , 2025 | 04:39 AM

జగన్‌ ఐదేళ్ల పాలనలో 5లక్షల కోట్ల అప్పులతో రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి దోచేశాడని, ఆ అప్పులకు కూటమి ప్రభుత్వం నెలకు రూ.22వేల కోట్ల వడ్డీలు కడుతోందని మంత్రి అచ్చెన్నాయుడు ధ్వజమెత్తారు.

  • మత్స్యకార బహిరంగ సభలో మంత్రి అచ్చెన్న

తాళ్లరేవు, జనవరి 3(ఆంధ్రజ్యోతి): జగన్‌ ఐదేళ్ల పాలనలో 5లక్షల కోట్ల అప్పులతో రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి దోచేశాడని, ఆ అప్పులకు కూటమి ప్రభుత్వం నెలకు రూ.22వేల కోట్ల వడ్డీలు కడుతోందని మంత్రి అచ్చెన్నాయుడు ధ్వజమెత్తారు. శుక్రవారం కాకినాడ జిల్లా తాళ్లరేవు మండలం కోరింగలో ప్రభుత్వ విప్‌, ముమ్మిడివరం ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజు అధక్షతన ఏర్పాటు చేసిన మత్స్యకారుల ఓఎన్‌జీసీ నష్టపరిహారం బహిరంగ సభలో మంత్రి మాట్లాడారు. 2024లో కూటమి అధికారంలోకి వచ్చేసరికి ప్రభుత్వం వెంటిలేటర్‌పై ఉందని, కేంద్రం సహకారంతో ఆక్సిజన్‌ను పీల్చుకుంటోందని వ్యాఖ్యానించారు. సూపర్‌ సిక్స్‌ హామీలు అమలుచేశాకే ప్రజల వద్దకు వెళతామన్నారు. మంత్రి కొల్లు రవీంద్ర మాట్లాడుతూ మత్స్యకారులకు వేట నిషేధ సమయంలో రూ.20వేల పరిహారం సీఎం చంద్రబాబు ఇవ్వనున్నారని, కూటమి ప్రభుత్వానికి మత్స్యకారులంతా అండగా ఉండాలన్నారు. అనంతరం ఓఎన్‌జీసీ అందించిన రూ.148 కోట్ల 37లక్షల 18,500ల చెక్కును అచ్చెన్నాయుడు మత్స్యకారులకు అందించారు.

Updated Date - Jan 04 , 2025 | 04:39 AM