ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మలేసియాలో చిక్కుకుపోయిన అన్నదమ్ములు!

ABN, Publish Date - Jan 23 , 2025 | 05:25 AM

వరుసకు సోదరులైన ఇద్దరు యువకులు పొట్టకూటి కోసం మలేసియా వెళ్లి చిక్కుల్లో పడ్డారు. వారిని ఉపముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్‌, మంత్రి నారా లోకేశ్‌ రక్షించి స్వదేశానికి తీసుకురావాలని వారి తల్లిదండ్రులు వేడుకుంటున్నారు.

జీవనోపాధి కోసం పరాయి దేశానికి పర్యాటక వీసాపై తీసుకెళ్లి వదిలేసిన ఏజెంట్‌

పోలీసులు పట్టుకున్నారంటూ ఇంటికి ఫోన్‌

లబోదిబోమంటున్న తల్లిదండ్రులు

మంత్రులు పవన్‌, లోకేశ్‌ ఆదుకోవాలని వేడుకోలు

రాపూరు, జనవరి 22(ఆంధ్రజ్యోతి): వరుసకు సోదరులైన ఇద్దరు యువకులు పొట్టకూటి కోసం మలేసియా వెళ్లి చిక్కుల్లో పడ్డారు. వారిని ఉపముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్‌, మంత్రి నారా లోకేశ్‌ రక్షించి స్వదేశానికి తీసుకురావాలని వారి తల్లిదండ్రులు వేడుకుంటున్నారు. నెల్లూరు జిల్లా రాపూరు మండలం తెగచర్ల గ్రామానికి చెందిన కరిపం పెంచలయ్య, కరిపం పెద్దయ్య అన్నదమ్ములు. వీరి పిల్లలు కరిపం పవన్‌కుమార్‌ (23), కరిపం సింహాద్రి(22) జీవనోపాధి కోసం ఏడు నెలల క్రితం మలేసియా వెళ్లారు. తిరుపతికి చెందిన ఏజెంట్‌ వెంకటేశ్వర్లు వీరిని పర్యాటక వీసాపై మలేసియాకు తీసుకెళ్లి మోసం చేశాడని తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు. పర్యాటక వీసా గడువు ముగియడంతో వారిని ఏజెంట్‌ మలేసియాలో వదిలేసి వెళ్లిపోయాడని, దిక్కుతోచని తమ బిడ్డలు అక్కడే ఉండిపోయారని తెలిపారు. 20 రోజుల క్రితం తమను పోలీసులు పట్టుకున్నారంటూ పవన్‌కుమార్‌ , సింహాద్రి ఫోన్‌ చేసి చెప్పారన్నారు. బుధవారం వెంకటగిరిలో ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణను కలిసి విషయం తెలియజేశామని పెంచలయ్య, పెద్దయ్య తెలిపారు. ఉపముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌, మంత్రి నారా లోకేశ్‌ స్పందించి తమ బిడ్డలను కాపాడాలని వారు వేడుకుంటున్నారు.


మరిన్ని తెలుగు వార్తల కోసం..

Also Read: ప్రయాణికులపై నుంచి దూసుకెళ్లిన రైలు: పలువురు మృతి

Also Read: తెలుగు రాష్ట్రాల హైకోర్టులకు జడ్జిలు నియామకం

Also Read: : గడ్డ కట్టే చలిలో సమావేశానికి నడిచి వెళ్లిన మంత్రి నారా లోకేష్

Also Read: రాజధాని అమరావతికి మళ్లీ గుడ్ న్యూస్

Also Read: బిహార్ సీఎం నితీష్ కీలక నిర్ణయం.. ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరణ

For AndhraPradesh News And Telugu News

Updated Date - Jan 23 , 2025 | 05:25 AM