Share News

Nara Lokesh: గడ్డ కట్టే చలిలో సమావేశానికి నడిచి వెళ్లిన మంత్రి నారా లోకేష్

ABN , Publish Date - Jan 22 , 2025 | 05:26 PM

Nara Lokesh in Davos: దావోస్‌లో పూర్తి ప్రతి కూల వాతావరణం నెలకొంది. ఉష్ణోగ్రతలు పూర్తిగా పడిపోయాయి. దీంతో మైనస్ 7 డిగ్రీలు ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఎముకలు కొరికే చలిలో సైతం దావోస్‌లో భారీగా ట్రాఫిక్‌ ఏర్పడింది. దీంతో మంత్రి నారా లోకేష్ ట్రాఫిక్‌లో చిక్కుకు పోయారు. దాంతో ఆయన.. కాలి నడకన నిర్ణీత సమయానికి కాంగ్రెస్ సెంటర్‌కు మంత్రి నారా లోకేష్ చేరుకొన్నారు.

Nara Lokesh: గడ్డ కట్టే చలిలో సమావేశానికి నడిచి వెళ్లిన మంత్రి నారా లోకేష్
AP Minister Nara Lokesh

దావోస్, జనవరి 22: పరిశ్రమ అవసరాలకు అనుగుణంగా నవీన ఆవిష్కరణలు జరగాలని ఆంధ్రప్రదేశ్ ఐటీ, విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ వెల్లడించారు. బుధవారం దావోస్‌లో వరల్డ్ ఎకనమిక్ ఫోరం సదస్సులో భాగంగా విద్యా రంగ గవర్నర్ల సమావేశంలో మంత్రి నారా లోకేష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్‌లో రూ.255 కోట్లతో మూడు ఎఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో ఎఐ శిక్షణకు మద్దతు ఇవ్వడానికి.. శిక్షణ పొందిన ఎఐ వర్క్‌ఫోర్స్‌ను రూపొందించడానికి... అలాగే ఆవిష్కరణలను ప్రోత్సహించడానికి మూడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సెంటర్స్ ఆఫ్ ఎక్సలెన్స్ (CoE) స్థాపనను ప్రభుత్వం మంజూరు చేసిందని వివరించారు.

గతేడాది అంటే.. 2024-25 మధ్యంతర బడ్జెట్‌లో అందుకోసం రూ.255 కోట్లు కేటాయించామని మంత్రి నారా లోకేష్ స్పష్టం చేశారు. ప్రపంచంలో పోటీతత్వాన్ని పెంచేందుకు STEM, AIపై దృష్టి సారించడం ద్వారా.. 2047 నాటికి 95% నైపుణ్యం కలిగిన శ్రామికశక్తిని తయారు చేయాలనేది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని ఈ సమావేశం వేదికగా మంత్రి నారా లోకేష్ తెలిపారు. కుటుంబానికి ఒక ఎంటర్‌ప్రెన్యూర్ వంటి కార్యక్రమాలకు విద్యా రంగ ఆవిష్కరణలు మార్గం సుగమం చేస్తాయని భావిస్తున్నామని పేర్కొన్నారు.


ఐఐటీ మద్రాస్ వంటి భాగస్వామ్యం ద్వారా ఎఐ ఆధారిత ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో నాయకత్వం వహించడానికి ఆంధ్రప్రదేశ్ తన అభ్యాసకులను సిద్ధం చేస్తోందని చెప్పారు. విస్తృత ఉపాధి కల్పన, సౌకర్యవంతమైన వర్క్‌ఫోర్స్ మోడల్‌తో నిరంతర అప్‌ స్కిల్లింగ్ కార్యక్రమాల ద్వారా రాష్ట్రాన్ని గ్లోబల్ టాలెంట్ హబ్‌గా స్థాపించాలని తమ ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందన్నారు.

Also Read: రాజధాని అమరావతికి మళ్లీ గుడ్ న్యూస్


ఈ విధానంలో అధునాతన సాంకేతికతలను ఉపయోగించుకోవడంతోపాటు డీప్ టెక్‌కు ప్రాధాన్యత ఇవ్వడం ద్వారా సాంకేతికత పరిష్కారాలను ప్రోత్సహిస్తామని మంత్రి లోకేష్ పేర్కొన్నారు. ప్రపంచవ్యాప్తంగా వేగవంతంగా మార్పు చెందుతున్న సాంకేతికలకు అనుగుణంగా పాఠ్యాంశాలు ఉండేలా విద్యా సంస్థలు, కార్పొరేట్‌ల భాగస్వామ్యంతో పని చేయాల్సి ఉందన్నారు.

Also Read: బిహార్ సీఎం నితీష్ కీలక నిర్ణయం.. ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరణ


వెయ్యి కంటే ఎక్కువ మంది ఉద్యోగులు కలిగిన 42 శాతం సంస్థలు తమ దైనందిన కార్యకలాపాలకు ఎఐని చురుగ్గా వినియోగిస్తున్నాయని ఈ సందర్భంగా మంత్రి నారా లోకేష్ సోదాహరణగా వివరించారు. ఎఐ వినియోగంలో భారతదేశం (59%), యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (58%), సింగపూర్ (53%) అగ్రగామిగా ఉన్నాయని మంత్రి నారా లోకేష్ స్పష్టం చేశారు.


ట్రాఫిక్ జామ్.. నడిచి వెళ్లిన నారా లోకేష్

మరోవైపు.. దావోస్‌లో పూర్తి ప్రతి కూల వాతావరణం నెలకొంది. ఉష్ణోగ్రతలు పూర్తిగా పడిపోయాయి. దీంతో మైనస్ 7 డిగ్రీలు ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఎముకలు కొరికే చలిలో సైతం దావోస్‌లో భారీగా ట్రాఫిక్‌ ఏర్పడింది. దీంతో మంత్రి నారా లోకేష్ ట్రాఫిక్‌లో చిక్కుకు పోయారు. దాంతో ఆయన.. కాలి నడకన నిర్ణీత సమయానికి కాంగ్రెస్ సెంటర్‌కు మంత్రి నారా లోకేష్ చేరుకొన్నారు.


ఇక ఇదే దావోస్ వేదికగా.. టెమాసెక్ హోల్డింగ్స్ భారత స్ట్రాటజిక్ ఇనిషియేటివ్ హెడ్ రవి లాంబాతో మంత్రి నారా లోకేష్ భేటీ అయ్యారు. ఆంధ్రప్రదేశ్‌లో టెమాసెక్ గ్రూపు అనుబంధ సంస్థ క్యాపిటా ల్యాండ్ ద్వారా ఇండస్ట్రియల్ పార్కులు, డాటా సెంటర్లలో పెట్టుబడులు పెట్టాలని సూచించారు. వైజాగ్, తిరుపతి నగరాల్లో కమర్షియల్ స్పేస్ ఏర్పాటు చేయటంతో పాటు పారిశ్రామిక క్లస్టర్‌లలో REIT మోడల్‌లో మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయాలన్నారు.


దాని అనుబంధ సంస్థ సెంబ్ కార్ఫ్‌తో కలసి రెన్యువబుల్ ఎనర్జీ, గ్రీన్ హైడ్రోజన్ రంగాల్లో పెట్టుబడులు పెట్టాలని విజ్జప్తి చేశారు. వైజాగ్, తిరుపతిలో సెమా టెక్ టెలీ మీడియా ద్వారా డేటా సెంటర్లు, డాటా సెంటర్ పార్కుల ఏర్పాటుకు సహకరించాలన్నారు. అదే విధంగా పవర్ ట్రాన్స్‌మిషన్‌ను బలోపేతం చేయడం, గ్రిడ్ స్థిరత్వాన్ని మెరుగుపర్చడం, బ్యాకప్ కోసం సెంబ్ కార్ప్ ఇండియా ద్వారా పెట్టుబడులు పెట్టాలని వారిని మంత్రి నారా లోకేష్ కోరారు.

For AndhraPradesh News And Telugu News

Updated Date - Jan 22 , 2025 | 05:28 PM