Share News

Telugu States High Courts: తెలుగు రాష్ట్రాల హైకోర్టులకు జడ్జిలు నియామకం

ABN , Publish Date - Jan 22 , 2025 | 06:39 PM

Telugu States High Courts: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ హైకోర్టులకు పలువురు జడ్జిల నియామకానికి సంబంధించిన దస్త్రంపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము బుధవారం ఆమోద ముద్ర వేశారు.

Telugu States High Courts: తెలుగు రాష్ట్రాల హైకోర్టులకు జడ్జిలు నియామకం
Telugu States High Courts

న్యూఢిల్లీ, జనవరి 22: తెలుగు రాష్ట్రాల హైకోర్టులకు పలువురు న్యాయమూర్తుల నియామకానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోద ముద్ర వేశారు. అందుకు సంబంధించిన నియామక ఉత్తర్వులను బుధవారం కేంద్ర న్యాయ మంత్రిత్వ శాఖ విడుదల చేసింది. అందులోభాగంగా తెలంగాణ హైకోర్టుకు నలుగురు న్యాయమూర్తులు జస్టిస్ రేణుక ఎర్రా, జస్టిస్ నర్సింగరావు నందికొండ, జస్టిస్ తిరుమల దేవి ఎడ, జస్టిస్ మధుసూధనరావు బొబ్బిలి రామయ్యలను నియమించింది. అలాగే ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకు ఇద్దరు న్యాయమూర్తులు.. జస్టిస్ అవధానం హరిహరనాథ శర్మ, జస్టిస్ యడవల్లి లక్ష్మణరావులను నియమించింది.

తెలుగు రాష్ట్రాల హైకోర్టులకు పలువురు న్యాయమూర్తులను ఎంపిక చేసేందుకు సుప్రీంకోర్టు ప్రధాన నాయమూర్తి జస్టిస్ సంజీవ్ ఖన్నా నేతృత్వంలో ఇటీవల న్యూఢిల్లీలో సమావేశమైంది. అందుకు పలువురు న్యాయమూర్తుల పేర్లను కేంద్రానికి సిఫార్స్ చేసింది. వీరి నియమాకానికి సంబంధించి.. ఈ రోజు రాష్ట్రపతి ఉత్తర్వులు జారీ చేసింది. అయితే హైకోర్టులో మొత్తం 37 మంది న్యాయమూర్తులు ఉండాల్సి ఉంది.


కానీ ప్రస్తుతం 28 మంది న్యాయమూర్తులే ఉన్నారు. ప్రస్తుతం కొలీజియం సిఫారసు చేసిన ఇద్దరూ వస్తే ఆ సంఖ్య 30కి చేరుతుంది. మరో ఏడుగురు న్యాయమూర్తుల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అలాగే తెలంగాణ హైకోర్టులో పలు ఖాళీలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో నలుగురు న్యాయమూర్తుల పేర్లను సిఫార్స్ చేశారు. వీరు న్యాయమూర్తులుగా ప్రమాణం చేయనున్నారు.

For AndhraPradesh News And Telangna News

Updated Date - Jan 22 , 2025 | 08:31 PM