Lokesh Yuvagalam: యువగళం పాదయాత్ర.. అరుదైన జ్ఞాపకం
ABN, Publish Date - Jan 27 , 2025 | 03:26 PM
Nara lokesh: యువగళం పాదయాత్ర రెండేళ్లు పూర్తైన సందర్భంగా లోకేష్ స్పందించారు. పాదయాత్ర ప్రతి అడుగులో ప్రజల కష్టాలు చూశానని.. ఆ రోజు చూసిన కన్నీటి గాథలు నేటికీ గుర్తున్నాయన్నారు. ఇచ్చిన ప్రతి హామీ గుర్తుందని తెలిపారు. ప్రజల ఆకాంక్షకు తగ్గట్టుగా ప్రజా ప్రభుత్వం పనిచేస్తుందన్నారు.
అమరావతి, జనవరి 27: టీడీపీ యువత నేత, మంత్రి నారా లోకేష్ (AP Minister Nara Lokesh) యువగళం పాదయాత్రను (Yuvagalam Padayatra) ప్రారంభించి నేటికి రెండేళ్లు పూర్తి అయ్యాయి. ఈ సందర్భంగా లోకేష్ స్పందిస్తూ.. యువగళం పాదయాత్ర తనకు జీవితకాలం గుర్తుండిపోయే అరుదైన జ్ఞాపకమన్నారు. నియంతృత్వాన్ని, నిర్బంధాలను దాటుకొని రాష్ట్రంలోని 11 ఉమ్మడి జిల్లాలు, 97 నియోజకవర్గాలు, 2,097 గ్రామాల మీదుగా 226 రోజుల పాటు 3132 కిలోమీటర్లు సాగిన చారిత్రాత్మక యువగళం పాదయాత్ర మొదలై నేటికి రెండేళ్లు పూర్తైందన్నారు. నాటి పాలకులు పాదయాత్ర ఆపడానికి చెయ్యని ప్రయత్నం లేదన్నారు.
మైక్ వెహికల్ సీజ్ చెయ్యడం దగ్గర నుంచి వాలంటీర్లను అరెస్టు చేయడం వరకూ అనేక విధాలుగా ఇబ్బందులు పెట్టారని గుర్తుచేసుకున్నారు. నాటి పాలకులు ఎన్ని అడ్డంకులు పెట్టినా ప్రజలు చూపించిన ప్రేమ తనను మరింత దృఢంగా మార్చిందన్నారు. పాదయాత్ర ప్రతి అడుగులో ప్రజల కష్టాలు చూశానని.. ఆ రోజు చూసిన కన్నీటి గాధలు నేటికీ గుర్తున్నాయన్నారు. ఇచ్చిన ప్రతి హామీ గుర్తుందని తెలిపారు. ప్రజల ఆకాంక్షకు తగ్గట్టుగా ప్రజా ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. హామీలు అన్ని క్రమ పద్ధతిలో అమలు చేస్తున్నామన్నారు. యువగళం పాదయాత్రలో ప్రత్యక్షంగా- పరోక్షంగా భాగమైన ప్రతి ఒక్కరికీ, తనను ఆదరించిన ప్రజలకు మంత్రి నార లోకేష్ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.
House For All: అందరికీ ఇళ్లు పథకం గైడ్‌లైన్స్.. మీరు అర్హులో కాదో చెక్ చేసుకోండి
టీడీపీ నేతల సంబరాలు...
అమరావతి: మరోవైపు యువగళం పాదయాత్ర ప్రారంభించి నేటికి రెండు సంవత్సరాలు పూర్తయిన నేపథ్యంలో కేంద్ర కార్యాలయంలో నేతలు , కార్యకర్తలు సంబరాలు చేసుకున్నారు. టీడీపీ స్టేట్ ఆర్గనైజింగ్ సెక్రటరీ నాదెండ్ల బ్రహ్మం ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి టపాసులు కాల్చారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి, జీవీ రెడ్డి,అశోక్ బాబు తదితర నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నాదెండ్ల బ్రహ్మం మాట్లాడుతూ.. నారా లోకేష్‌ను చూస్తే వైసీపీ నేతల వెన్నులో వణుకు పుడుతుందన్నారు. పాదయాత్ర ప్రారంభించేటప్పుడు అవహేళన చేసిన వైసీపీ నేతలకు పాదయాత్ర పూర్తయ్యే నాటికి భయం ఏర్పడిందన్నారు. తండ్రి, తాత ముఖ్యమంత్రులుగా ఉన్న నారా లోకేష్ ఎక్కడ అధికార దర్పం ప్రదర్శించలేదని తెలిపారు. ఈరోజు కూటమి గెలుపులో నారా లోకేష్ పాత్ర ఎంతో ఉందన్నారు.
తొలిరోజే చెప్పి..చేసి చూపించారు: భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి
నారా లోకేష్ పాదయాత్ర ప్రజలకు ఒక భరోసా కల్పించిందని ఎమ్మెల్సీ భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి అన్నారు. జగన్‌ను తాడేపల్లి ప్యాలెస్‌లో కూర్చో పెడతామని పాదయాత్ర తొలి రోజే చెప్పి.. చేసి చూపించిన నేత లోకేష్ అని కొనియాడారు. ఆనాడు కష్టాల్లో ఉన్న ప్రతి ఒక్కరికీ ఒక ధైర్యం భరోసా కల్పిస్తూ పాదయాత్ర సాగిందన్నారు.
నేనున్నానంటూ భరోసా: జీవీ రెడ్డి
ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు నారా లోకేష్ పాదయాత్రతో ఒక భరోసా ధైర్యం ఏర్పడిందని ఏపీ ఫైబర్ నెట్ చైర్మన్ జీవీ రెడ్డి అన్నారు.ర పాదయాత్రలో ఇచ్చిన ప్రతి హామీని నిలబెట్టుకునే పనిలోనే లోకేష్ ఉన్నారన్నారు. టీడీపీ కార్యకర్తలకు చిన్న కష్టం వచ్చినా నేనున్నానని భరోసా నారా లోకేష్ ఇస్తున్నారని జీవీ రెడ్డి పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి...
ట్రంప్ సంచలన నిర్ణయం.. ఈ దేశాలకు సహాయం బంద్
సాయంత్రం 4 గంటలకు ఎండీకి సమ్మె నోటీసు..
Read Latest AP News And Telugu News
Updated Date - Jan 27 , 2025 | 03:39 PM