Machilipatnam: పోలీస్ కానిస్టేబుల్ ఈవెంట్స్‌లో అపశృతి.. ఇలాంటి పరిస్థితి ఎవ్వరికీ రావొద్దు..
ABN, Publish Date - Jan 02 , 2025 | 04:58 PM
కృష్ణా జిల్లా మచిలీపట్నంలో నిర్వహిస్తున్న పోలీస్ కానిస్టేబుల్స్ అభ్యర్థుల దేహదారుఢ్య పరీక్షల్లో అపశృతి చోటు చేసుకుంది. ఎన్టీఆర్ జిల్లా ఏ.కొండూరుకు చెందిన చంద్రశేఖర్(25) పోలీస్ కావాలని కలలు కన్నాడు. ఈ మేరకు ఇటీవల ఏపీ ప్రభుత్వం విడుదల చేసిన నోటిఫికేషన్‌కు అప్లై చేసి ఈవెంట్స్‌కు ప్రిపేర్ అయ్యాడు.
కృష్ణా జిల్లా: పోలీస్ ఉద్యోగమంటే యువకుల్లో ఎంతో క్రేజ్ ఉంటుంది. ఒక్కసారైనా ఒంటిపై ఖాకీ చొక్కా వేయాలని ఎంతో మంది యువత ఆరాట పడుతుంటారు. ప్రజలకు సేవ చేయాలని, నేరస్థులను జైళ్లలోకి పంపాలని ఎన్నో కళలు కంటుంటారు. అందుకే పోలీసు ఉద్యోగాల కోసం నోటిఫికేషన్ వచ్చిందంటే చాలు తెగ సంబర పడిపోతుంటారు. ఎలాగైనా ఉద్యోగం సాధించాలని రాత్రిబంవళ్లు కష్టపడి చదువుతారు. అత్యంత కష్టమైన దేహదారుఢ్య పరీక్షలను ఛేదించేందుకు ఎంతో శ్రమిస్తారు. అయితే కొన్నిసార్లు విధి వక్రీకరిస్తుంది. ఈవెంట్స్ కోసం ఎంతో శ్రమించినప్పటికీ విజయం సాధిస్తామా, లేదా? అనే ఒత్తిడికి యువత గురవుతుంటారు. ఇలాంటి మానసిక స్థితిలో పోటీలకు హాజరై అనేక మంది విఫలమవుతుంటారు. మరికొన్ని సందర్భాల్లో అసాధారణంగా రన్నింగ్ రేసు ట్రాక్ పైనే ప్రాణాలు కోల్పోతుంటారు.
తాజాగా అటువంటి ఘటనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చోటు చేసుకుంది. కృష్ణా జిల్లా మచిలీపట్నంలో నిర్వహిస్తున్న పోలీస్ కానిస్టేబుల్స్ అభ్యర్థుల దేహదారుఢ్య పరీక్షల్లో అపశృతి చోటు చేసుకుంది. ఎన్టీఆర్ జిల్లా ఏ.కొండూరుకు చెందిన చంద్రశేఖర్(25) పోలీస్ కావాలని కలలు కన్నాడు. ఈ మేరకు ఇటీవల ఏపీ ప్రభుత్వం విడుదల చేసిన నోటిఫికేషన్‌కు అప్లై చేసి ఈవెంట్స్‌కు ప్రిపేర్ అయ్యాడు. ఈ మేరకు నేడు మచిలీపట్నంలో నిర్వహిస్తున్న దేహదారుఢ్య పరీక్షలకు హాజరయ్యాడు. అయితే 1,600 మీటర్ల పరుగు పందెంలో చంద్రశేఖర్ పాల్గొనగా.. కాసేపటికే అతను సొమ్మసిల్లి పడిపోయాడు. అప్రమత్తమైన పోలీసు సిబ్బంది యువకుడిని కాపాడే ప్రయత్నం చేశారు.
అక్కడే ఉన్న అంబులెన్స్ సిబ్బంది సైతం చంద్రశేఖర్ ప్రాణాలు నిలిపే ప్రయత్నం చేశారు. అయితే ఆ యువకుడు స్పందించకపోవడంతో హుటాహుటిన మచిలీపట్నం సర్వజన ఆస్పత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు వెంటనే చికిత్స ప్రారంభించి ప్రాణాలు నిలిపేందుకు ఎంతో శ్రమించారు. అయినప్పటికీ చంద్రశేఖర్ మృతి చెందారు. దీంతో అక్కడంతా విషాద వాతావరణం చోటు చేసుకుంది. త్వరలో తమ కుమారుడికి పోలీసు ఉద్యోగం వస్తుందని ఎన్నో ఆశలతో ఎదురుచూస్తున్న ఆ తల్లిదండ్రులపై పిడుగు లాంటి వార్త పడింది. కుమారుడి మరణ వార్త విని గుండెలు పగిలేలా చంద్రశేఖర్ తల్లిదండ్రులు రోదిస్తున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి:
CM Chandrababu: ఏపీలో పథకాలపై సీఎం చంద్రబాబు కీలక నిర్ణయం
AP Politics: టీడీపీ వర్సెస్ వైసీపీగా మండల సర్వసభ్య సమావేశం.. మాటల యుద్ధానికి దిగిన ఇరువర్గాలు..
Updated Date - Jan 02 , 2025 | 04:59 PM