ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

CM Chandrababu: ఆ నమ్మకం నాపై ఉంచండి.. స్వర్ణాంధ్ర సాధిస్తా

ABN, Publish Date - Jan 03 , 2025 | 04:23 PM

Andhrapradesh: ఆనందంగా ఉండాలంటే స్వామీజీల వల్ల సాధ్యమవుతుందని సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. స్వామీజీపై పెట్టిన నమ్మకంతో కొంత పాలకులైన తనపై పెడితే స్వర్ణాంధ్ర సాధిస్తామని చెప్పుకొచ్చారు. అందరూ యదార్థాలని కూడా చెప్పేలా ఉండాలని.. ప్రతి ఒక్కరికీ స్పిరిచాలిటీ ఉండాలని తెలిపారు. భగవంతుని ఆశీస్సులు మనకి ఉండాలన్నారు.

CM Chandrababu Naidu

విజయవాడ, జనవరి 3: ‘‘స్వర్ణాంధ్ర నా సంకల్పం’’ అని అన్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (AP CM Chandrababu naidu). విజయవాడలో గణపతి సచ్చిదానంద స్వామీజీ చేపట్టిన ఆంద్రప్రదేశ్ 42 ఊర్లలో దత్తక్షేత్ర నాద యాత్ర- 2025ను ముఖ్యమంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు మాట్లాడుతూ... విజన్ 2020 అంటే అప్పట్లో అందరికి అర్ధం కాలేదు కానీ ఇప్పుడు అర్థం అవుతోందన్నారు. ఇపుడు విజన్ 2047 కోసం పనిచేస్తున్నానని తెలిపారు. సంపద సృష్టించినా ఆనందంగా ఉండటం ముఖ్యమన్నారు. ఆనందంగా ఉండాలంటే స్వామీజీల వల్ల సాధ్యమవుతుందని అన్నారు. స్వామీజీపై పెట్టిన నమ్మకంతో కొంత పాలకులైన తనపై పెడితే స్వర్ణాంధ్ర సాధిస్తామని చెప్పుకొచ్చారు. అందరూ యదార్థాలని కూడా చెప్పేలా ఉండాలని.. ప్రతి ఒక్కరికీ స్పిరిచాలిటీ ఉండాలని తెలిపారు. భగవంతుని ఆశీస్సులు మనకి ఉండాలన్నారు. గణపతి సచ్చిదానంద ఆశీస్సులు తీసుకోవటం ఆనందంగా ఉందని తెలిపారు. తాను కష్టాల్లో ఉన్నపుడు పూజ చేసి ఫలితాన్ని తన చేతికి ఇచ్చారన్నారు. మంచికోసం స్వామీజీ పరితపిస్తారని కొనియాడారు. స్వామీజీ ని ఎప్పుడు కలిసినా మనశాంతి దొరుకుతుందని ముఖ్యమంత్రి అన్నారు.


రఘురామ కేసులో ట్విస్టు.. విచారణకు రాలేనంటూ..

‘‘గణపతి సచ్చిదానం స్వామీజీ దర్శనం చేసుకోవడం నా అదృష్టంగా భావిస్తున్నా. ఆయన ఆశీస్సులు తీసుకున్నా. ఒక మంచి మనుసుతో స్వామీజీ ఆశీర్వదిస్తారు. సమాజం కోసమే స్వామీజీ పనిచేస్తున్నారు. నేను కష్టాల్లో ఉన్నప్పుడు ఆయన పూజ చేసి ఆ ఫలితాన్ని నా చేతికిచ్చారు. ఒక మంచి కోసం ఏ విధంగా ఆలోచిస్తారనేదానికి స్వామిజీ ఒక ఉదాహరణ. దత్త క్షేత్రాలు పెట్టి భక్తుల కోసం వస్తారన్నారు. స్వామీజీని ఎప్పుడు కలిసినా.. ఎన్నిసార్లు కలిసినా అక్కడే ఉండాలని అనిపిస్తుంది. ఆయన దగ్గర మనశాంతి దొరుకుతుంది. విజన్ 2020 అంటే సమైక్యాంధ్రలో చాలా మంది తప్పుబట్టారు. కానీ ఆ విజన్ ఈరోజు యదార్థ రూపాన్ని చూపిస్తోంది. ఇప్పుడు విజన్ 2047 స్వర్ణాంధ్ర దిశగా ఆలోచిస్తున్నాం. సంపద ఇవ్వడంలో ముందుకు వెళ్తాం. కానీ ఆనందంగా ఉండాలంటే స్వామీజీ వల్లనే సాధ్యం. భగవంతుడు ఆశీస్సులు కావాలంటే.. ఆ భగవంతుడికి దగ్గర చేసే వ్యక్తే గణపతి సచ్చిదానంద స్వామి. నాదస్వరంతో సమస్యలు పరిష్కారం చేసే శక్తి గణపతి సచ్చిదానంద స్వామి సొంతం. రాష్ట్రంలో స్వామీజీ ఉన్నంత వరకు శుభమే జరుగుతుంది. ప్రజలకు మంచి జరగాలని, దేవుడి ఆశీర్వాదం ఉండాలని స్వామీజీ భావిస్తున్నారు. నేను కూడా స్వామీజీ ఆశీస్సులతో ప్రజలకు ఆర్థిక స్వావలంబన కలగాలని, పేదరికం పూర్తిగా పోవాలని, ప్రజలందరూ ఆనందంగా ఉండాలని ఆశిస్తున్నా. దానికి స్వామిజీ ఆశీస్సులు ముఖ్యం’’ అని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు.


ఇవి కూడా చదవండి...

వందే భారత్ స్లీపర్ ట్రైన్ అదుర్స్.. వేగం తెలిస్తే షాక్..

రికార్డు అమ్మకాలు.. ఒక్కరోజే రూ.9 కోట్ల మద్యం తాగేశారు

Read Latest AP News And Telugu news

Updated Date - Jan 03 , 2025 | 04:57 PM