Justice Jayasurya : శ్రీవారి సేవలో జస్టిస్ జయసూర్య
ABN, Publish Date - Feb 10 , 2025 | 04:56 AM
హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ జయసూర్య తిరుమల శ్రీవారిని ఆదివారం దర్శించుకున్నారు. ఉదయం వీఐపీ బ్రేక్ సమయంలో స్వామివారిని దర్శించుకుని..
తిరుమల, ఫిబ్రవరి9(ఆంధ్రజ్యోతి): రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ జయసూర్య తిరుమల శ్రీవారిని ఆదివారం దర్శించుకున్నారు. ఉదయం వీఐపీ బ్రేక్ సమయంలో స్వామివారిని దర్శించుకుని రంగనాయకమండపానికి చేరుకున్న ఆయనకు వేదపండితులు ఆశీర్వచనం చేయగా అధికారులు లడ్డూప్రసాదాలు అందజేశారు. అలాగే గౌహతి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ విజయ్ బిష్ణోయ్, మద్రాసు హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ దండపాణి కూడా వేర్వేరుగా శ్రీవారిని దర్శించుకున్నారు.
Updated Date - Feb 10 , 2025 | 04:56 AM