YV Subba Reddy: విక్రాంత్‌రెడ్డికి ముందస్తు బెయిల్
ABN, Publish Date - Mar 08 , 2025 | 05:27 AM
రూ.25వేలతో రెండు పూచీకత్తులు సమర్పించాలని స్పష్టంచేసింది. దర్యాప్తునకు సహకరించాలని, కోరినప్పుడు దర్యాప్తు అధికారి ముందు హాజరుకావాలని ఆదేశించింది.
షరతులతో మంజూరుచేసిన హైకోర్టు
అమరావతి, మార్చి 7(ఆంధ్రజ్యోతి): కాకినాడ డీప్ వాటర్ పోర్ట్, కాకినాడ సెజ్‌లోని కేవీఆర్ గ్రూపు వాటాలు అరబిందోకు బదలాయింపు వ్యవహారంలో సీఐడీ నమోదు చేసిన కేసులో వైసీపీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి కుమారుడు వై.విక్రాంత్‌రెడ్డికి హైకోర్టు షరతులతో కూడిన ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. రూ.25వేలతో రెండు పూచీకత్తులు సమర్పించాలని స్పష్టంచేసింది. దర్యాప్తునకు సహకరించాలని, కోరినప్పుడు దర్యాప్తు అధికారి ముందు హాజరుకావాలని ఆదేశించింది. కేసుతో సంబంధం ఉన్న, కేసు వివరాలు తెలిసిన వ్యక్తులను ప్రత్యక్షంగా కానీ, పరోక్షంగా కానీ బెదిరించడం, భయపెట్టడం వంటివి చేయడానికి వీల్లేదని తేల్చిచెప్పింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ కె.శ్రీనివాసరెడ్డి శుక్రవారం తీర్పు ఇచ్చారు. తనను బెదిరించి, భయపెట్టి కాకినాడ డీప్ వాటర్ పోర్ట్, కాకినాడ సెజ్‌లోని రూ.3,609కోట్ల విలువైన వాటాలు అరబిందోకు బదలాయించుకున్నారని కేవీఆర్ గ్రూపు అధినేత కర్నాటి వెంకటేశ్వరరావు(కేవీ రావు) గత డిసెంబరు 2న ఫిర్యాదు చేశారు. దీని ఆధారంగా మంగళగిరి సీఐడీ పోలీసులు కేసు నమోదుచేశారు. ఈ కేసులో ఏ-1గా ఉన్న విక్రాంత్‌రెడ్డి ముందస్తు బెయిల్ కోరుతూ పిటిషన్ వేసిన విషయం తెలిసిందే. దానిపై ఇటీవల వాదనలు ముగియడంతో తీర్పు రిజర్వ్ చేసిన న్యాయమూర్తి.. శుక్రవారం తీర్పు వెలువరించారు.
ఇవి కూడా చదవండి...
Also Read: వేయించిన తెల్ల నువ్వులు, బెల్లం కలిపి తీసుకుంటే ఇన్ని ప్రయోజనాలా..
Also Read: తమిళనాడు సీఎం ఏంకే స్టాలిన్ కీలక నిర్ణయం.. సీఎంలకు లేఖ
Also Read: పోసానికి గుడ్ న్యూస్ కానీ.. జైల్లోనే..
Also Read : రంగయ్య మృతి.. సీఎం చంద్రబాబు సంచలన నిర్ణయం
మరిన్ని ఏపీ వార్తలు కోసం క్లిక్ చేయండి..
Updated Date - Mar 08 , 2025 | 05:27 AM