ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

AP New DGP: ఏపీకి కొత్త పోలీస్ బాస్

ABN, Publish Date - Jan 29 , 2025 | 09:08 PM

AP New DGP: ఆంధ్రప్రదేశ్ నూతన డీజీపీగా హరీష్ కుమార్ గుప్తా నియమితులయ్యారు. ఆయన స్థానంలో ఉన్న ప్రస్తుత డీజీపీ సిహెచ్ ద్వారకా తిరుమల రావు.. జనవరి 31వ తేదీన రిటైర్ కానున్నారు.

AP New DGP Harish Kumar Gupta

అమరావతి, జనవరి 29: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కొత్త డీజీపీగా హరీష్ కుమార్ గుప్తా నియమితులయ్యారు. ఇప్పటి వరకు విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టర్ జనరల్‌గా ఆయన విధులు నిర్వహించారు. అయితే ప్రస్తుతం డీజీపీగా ఉన్న సీహెచ్ ద్వారకా తిరుమల రావు జనవరి 31వ తేదీన రిటైర్ కాబోతున్నారు. ఈ నేపథ్యంలో హరీష్ కుమార్ గుప్తా పేరును కొత్త డీజీపీగా ఖరారు చేసినట్లు తెలుస్తోంది. అదీకాక.. ద్వారకా తిరుమల రావు రిటైర్ కాబోతున్న తరుణంలో.. రాష్ట్రానికి కొత్త డీజీపీగా మాదిరెడ్డి ప్రతాప్‌తోపాటు హరీష్ కుమార్ గుప్తా పేరును పరిశీలించినట్లు సమాచారం. ఈ రెండు పేర్లలో హరీష్ కుమార్ పేరును కొత్త డీజీపీ పదవి వరించింది.

హరీష్ కుమార్ గుప్తా స్వస్థలం జమ్మూ కశ్మీర్. గతేడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఏపీ డీజీపీగా హరీష్ కుమార్ గుప్తాను కేంద్ర ఎన్నికల సంఘం నియమించిన సంగతి తెలిసిందే.


కూటమి ప్రభుత్వం కొలువు తీరిన అనంతరం కొత్త డీజీపీగా సిహెచ్ ద్వారకా తిరుమల రావును ప్రభుత్వం నియమించిన విషయం విధితమే. 1992 బ్యాచ్ ఆంధ్ర కేడర్ ఐపీఎస్ అధికారి అయిన హరీష్ కుమార్ గుప్తా.. పలు జిల్లాలకు ఎస్పీగా పని చేశారు.

మరిన్నీ తెలుగు వార్తల కోసం..

Also Read: విశాఖపట్నం స్టీల్ ప్లాంట్‌కు కేంద్ర మంత్రులు.. అసలు విషయం ఇదే

Also Read: పంచగ్రామాల ప్రజలకు గుడ్ న్యూస్

Also Read: ఆన్‌లైన్ మోసాలకు పాల్పడుతోన్న ముఠా గుట్టను రట్టు చేసిన పోలీసులు

Also Read: మీకు వాట్సాప్ ఉంటే చాలు.. మీ ఫోన్‌లోనే ప్రభుత్వం

Also Read: జాతీయ క్రీడల జరుగుతోన్న వేళ.. ఏపీ హైకోర్టు కీలక తీర్పు

Also Read: హైకోర్టు తీర్పుపై స్పందించిన జ్యోతి సురేఖ

For AndhraPradesh News And Telugu News

Updated Date - Jan 30 , 2025 | 12:34 AM