HighCourt: బోరుగడ్డ అనిల్ కుమార్‌కు చుక్కెదురు.. అందుకు నో చెప్పిన హైకోర్టు..
ABN, Publish Date - Jan 02 , 2025 | 12:04 PM
వైసీపీ సానుభూతిపరుడు బోరుగడ్డ అనిల్ కుమార్(Borugadda Anil Kumar)కు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు(AP High Court)లో చుక్కెదురు అయ్యింది. సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులు పెట్టాడంటూ అనిల్ కుమార్‌పై అనంతపురం(Anantapur) నాలుగో పట్టణ పోలీసులు కేసు నమోదు చేశారు.
అమరావతి: వైసీపీ సానుభూతిపరుడు బోరుగడ్డ అనిల్ కుమార్ (Borugadda Anil Kumar)కు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు (AP High Court)లో చుక్కెదురు అయ్యింది. సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులు పెట్టాడంటూ అనిల్ కుమార్‌పై అనంతపురం (Anantapur) నాలుగో పట్టణ పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో తనకు బెయిల్ (Bail Petition) ఇవ్వాలంటూ బోరుగడ్డ ఇటీవల హైకోర్టును ఆశ్రయించాడు. దీనిపై నేడు విచారణ చేపట్టిన ధర్మాసనం అతడి పిటిషన్‌ను కొట్టివేసింది.
Tirumala: మళ్లీ రిపీట్.. శ్రీవారి ఆలయం పై నుంచి విమానం.. భక్తుల ఆగ్రహం
విచారణ సందర్భంగా పిటిషనర్ బోరుగడ్డ సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులు పెట్టడమే పనిగా పెట్టుకున్నారా? అంటూ న్యాయస్థానం ఘాటు వ్యాఖ్యలు చేసింది. కాగా, పిటిషనర్ అనిల్‌కు పూర్వ నేర చరిత్ర ఉందని, అనుచిత పోస్టులు పెట్టిన వ్యవహారంలో నమోదైన కేసుల్లో ఇప్పటికే రెండు కేసుల్లో ఛార్జ్ షీట్ సైతం దాఖలు అయ్యిందని హైకోర్టుకు ప్రాసిక్యూషన్ తెలిపారు. ఈ కేసుల్లో బీఎన్ఎస్ సెక్షన్ 111 వర్తిస్తుందని ఆయన ధర్మాసనానికి వివరించారు. ప్రాసిక్యూషన్ వాదనలతో ఏకీభవించిన న్యాయమూర్తి.. ఇలాంటి కేసుల్లో నిందితులను క్షమించడానికి వీల్లేదని అభిప్రాయపడ్డారు. ఈ మేరకు బోరుగడ్డ వేసిన బెయిల్ పిటిషన్‌ను కొట్టివేశారు.
ఈ వార్తలు కూడా చదవండి:
Kakinada: గంజాయి స్మగ్లర్ల దారుణం.. తనిఖీలు చేస్తున్న పోలీసులపైకే ఏకంగా..
AP News: స్టీల్ ఫ్యాక్టరీలో అగ్నిప్రమాదంపై సూళ్లూరుపేట ఎమ్మెల్యే ఏమన్నారంటే..
Updated Date - Jan 02 , 2025 | 12:06 PM