ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

శైలంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ

ABN, Publish Date - Feb 20 , 2025 | 06:16 AM

తొలిరోజు యాగశాల ప్రవేశంతో ఉత్సవాలను ఆలయ అర్చకులు ప్రారంభించారు. బ్రహ్మోత్సవాల పర్యవేక్షకుడైన చండీశ్వరుడికి ప్రత్యేకంగా పూజలు జరిపారు.

ధ్వజారోహణంతో సకల దేవతలకు ఆహ్వానం

శ్రీశైలం, ఫిబ్రవరి 19(ఆంధ్రజ్యోతి): శ్రీశైలం మహక్షేత్రంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు బుధవారం ఘనంగా ప్రారంభమయ్యాయి. తొలిరోజు యాగశాల ప్రవేశంతో ఉత్సవాలను ఆలయ అర్చకులు ప్రారంభించారు. బ్రహ్మోత్సవాల పర్యవేక్షకుడైన చండీశ్వరుడికి ప్రత్యేకంగా పూజలు జరిపారు. రాత్రి 7 గంటలకు బేరిపూజ, బేరితాండవం సకల దేవతలను ఆహానిస్తూ ధ్వజారోహణ, ధ్వజపటం ఆవిష్కరణతో బ్రహ్మోత్సవాలకు శ్రీకారంచుట్టారు. బ్రహ్మోత్సవాల మొదటి రోజు భ్రమరాంబికాదేవి, మల్లికార్జున స్వామివార్లకు శ్రీకాళహస్తి దేవస్థానం తరపున పట్టువస్త్రాలు సమర్పించారు. నవాహ్నిక దీక్షతో 11 రోజులపాటు జరిగే ఈ బ్రహ్మోత్సవాలు మార్చి 1న ముగియనున్నాయి. కాగా గురువారం స్వామి, అమ్మవార్లకు భృంగివాహన సేవ నిర్వహించనున్నారు.



రేపటి నుంచి శ్రీకాళహస్తిలో..

శ్రీకాళహస్తి, ఫిబ్రవరి 19(ఆంధ్రజ్యోతి): తిరుపతి జిల్లా శ్రీకాళహస్తిలో శుక్రవారం నుంచి మహాశివరాత్రి ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి. 14 రోజుల పాటు జరగనున్న ఈ వేడుకలకు 21న కన్నప్ప ధ్వజారోహణంతో శాస్త్రోక్తంగా అంకురార్పాణ జరగనుంది. భక్తుడైన కన్నప్పకు తొలి పూజలు అందుకునేలా ఇచ్చిన వరాన్ని ఈ క్షేత్రంలో నిర్వహించడం అనాదిగా వస్తోంది. 21న కన్నప్ప ధ్వజారోహణం, 22న స్వామివారి ధ్వజారోహణం నిర్వహించనున్నారు.



Also Read:

వరద సాయం ప్రకటించిన కేంద్రం.. ఏపీకే ఎక్కువ

ఉగ్రవాదాన్ని ఎగదోస్తున్న పాక్.. ఐరాసలో భారత్ నిప్పులు

యుద్ధాన్ని మొదలుపెట్టిందే మీరు.. జెలెన్ స్కీపై ట్రంప్ ఫైర్..

For More Telangana News and Telugu News..

Updated Date - Feb 20 , 2025 | 06:16 AM