Trump Zelensky : యుద్ధం మొదలుపెట్టిందే మీరు.. ఈ మూడేళ్లు ఏం చేశారు.. జెలెన్ స్కీపై ట్రంప్ ఫైర్..
ABN , Publish Date - Feb 19 , 2025 | 03:13 PM
Donald Trump : రష్యాపై గెలిచే సత్తా ఉక్రెయిన్‌కు లేదు. అయినా పోరుకు సిద్ధమైంది. అసలు ఈ యుద్ధం మొదలుకావడానికి ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీనే కారణం అంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. దాడికి ముందే ఆ రెండు దేశాలు ఒక ఒప్పందానికి వచ్చి ఉంటే..
Donald Trump : రష్యా-ఉక్రెయిన్ యుద్ధానికి ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలన్ స్కీయే కారణమని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆరోపించారు. రెండు దేశాల మధ్య తేడాలు, బలాబలాలను పరిశీలిస్తే ఉక్రెయిన్ రష్యాకు దరిదాపుల్లోకి ఫ్లోరిడాలో జరిగిన విలేకరులు సమావేశంలో ఆయన వెల్లడించారు. యుద్ధానికి ముందే రష్యాతో చర్చల ద్వారా జెలెన్ స్కీ సమస్యను పరిష్కరించుకోకపోవడం వల్ల పరిస్థితి మరింత దిగజారిందని.. దాడి జరిగిపోయిన తర్వాత వ్యతిరేకించినా ప్రయోజనం లేదని అన్నారు. ఇంకా ఏమన్నారంటే..
ఇదొక బుద్ధి తక్కువ యుద్ధం..
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రష్యా ఉక్రెయిన్ యుద్ధంపై మీడియాతో మాట్లాడుతూ, జెలెన్ స్కీ బలంలో తమకంటే చాలా శక్తివంతమైన దేశంతో యుద్ధం చేస్తున్నారని అన్నారు. రష్యా దాడిని ఆపడంలో ఉక్రెయిన్ చాలావరకు విజయం సాధించింది. అయితే మాస్కో సైన్యం వారి ప్రతిఘటన చర్యలు వ్యర్థమయ్యాయి. ఈ యుద్ధం కొనసాగించే సామర్థ్యం లేదని తెలిసీ జెలెన్ స్కీ యుద్ధం మొదలుపెట్టి చాలా పెద్ద తప్పు చేశారు. ముందే చర్చల ద్వారా సమస్యను పరిష్కరించడానికి ప్రయత్నించాల్సిందని ట్రంప్ పేర్కొన్నారు. సౌదీ శాంతి చర్చలకు నన్ను ఆహ్వానించలేదని జెలెన్ స్కీ వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు. అక్కడ మూడేళ్ల నుంచి నువ్వేం చేస్తున్నావు. మీరే ఈ పోరును ముగించాల్సింది. అసలు ఏదొక డీల్ చేసుకోకుండా ప్రారంభించడమే పెద్ద తప్పని అన్నారు. ఇదొక బుద్ధి తక్కువ యుద్ధమని అభిప్రాయపడ్డారు.
నేనైతే ఈ పని చేయను : ట్రంప్
యుద్ధం వల్ల రెండు దేశాలు తీవ్రంగా నష్టపోయాయి. వేలాది మంది ప్రాణాలు కోల్పోయారు. నేను అక్కడ ఉండి ఉంటే సులభంగా రాజీచేసి ఈ పోరాటాన్ని ఆపగలిగేవాడిని. కానీ జెలెన్ స్కీ యుద్ధ మార్గాన్ని ఎంచుకున్నాడు. అతడి నిర్ణయం కారణంగా ఉక్రెయిన్, రష్యాకు చెందిన వేలాది మంది సైనికులు, అమాయకులు బలి అయ్యారు. ఇప్పటికైనా ఉక్రెయిన్ ముందుకొస్తే ఒప్పందం కుదిర్చి పోగొట్టున్న భూమి అంతా వెనక్కి ఇప్పిస్తా. ప్రజలు, నగరాలకు కించిత్తు కూడా నష్టం జరగకుండా చేయగలను. కానీ, అలా జరగడం అతడికి ఇష్టం లేదని జెలెన్ స్కీని పరోక్షంగా విమర్శించారు. ఉక్రెయిన్ దేశం యుద్ధం వల్ల అల్లకల్లోలంగా మారింది. నిజానికి కీవ్ అధ్యక్షుడికి ప్రజల నుంచి 4 శాతం మద్ధతు కూడా లేదని.. వెంటనే ఎన్నికలు నిర్వహించాలని తీవ్ర ఆరోపణలు చేశారు. దీనిని ముగించేందుకు ప్రయత్నిస్తున్నట్లు స్పష్టం చేశారు.
Read Also : ఆందోళనకరంగా పోప్ ప్రాన్సిస్ ఆరోగ్య పరిస్థితి.. వైద్యులు ఏం చెప్పారంటే..
భారత్‌కు డబ్బులు ఎందుకివ్వాలి.. ట్రంప్ షాకింగ్ కామెంట్స్..
Gold : లండన్ నుంచి న్యూయార్క్‌కు బంగారం తరలింపు
మరిన్ని అంతర్జాతీయ, తెలుగు వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..