Share News

Central Govt: ఐదు రాష్ట్రాలకు వరద సాయం నిధులు రిలీజ్.. ఏపీకి ఎంతంటే

ABN , Publish Date - Feb 19 , 2025 | 03:14 PM

Central Govt: విపత్తులు, వరద సాయంలో ఏపీకి పెద్ద మొత్తంలో కేంద్రం నుంచి నిధులు విడుదలయ్యాయి. దేశంలోని ఐదు రాష్ట్రాలకు విపత్తు, వరదల సాయం కింద రూ. 1,554.99 కోట్ల నిధులను కేంద్రం విడుదల చేసింది.

Central Govt: ఐదు రాష్ట్రాలకు వరద సాయం నిధులు రిలీజ్.. ఏపీకి ఎంతంటే
Central Govt

అమరావతి, ఫిబ్రవరి 19: దేశంలో ఐదు రాష్ట్రాలకు విపత్తులు, వరద సాయం కింద కేంద్రం (Central Govt) బుధవారం నిధులను (flood relief funds) విడుదల చేసింది. విపత్తు, వరదల సాయం కింద ఐదు రాష్ట్రాలకు మొత్తం రూ. 1,554.99 కోట్లు రిలీజ్ అయ్యాయి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, నాగాలాండ్, ఒడిస్సా, త్రిపుర రాష్ట్రాలకు వరద సాయం నిధులు విడుదలయ్యాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పెద్ద మొత్తంలో నిధులను విడుదల చేసింది కేంద్రం. కేంద్ర హోంమంత్రి అమిత్ షా (Union Minister Amit shah) అధ్యక్షతన జరిగిన ఉన్నత స్థాయి సమావేశంలో ఈ నిధులు విడుదలకు ఆమోదం లభించింది.


fund.jpg

2024లో వర్షాలు, ఆకస్మిక వరదలు, కొండచరియలు విరిగిపడటంతో తుఫాను కారణంగా ప్రభావితమైన రాష్ట్రాలకు డిసాస్టర్ రెస్పాన్స్ ఫండ్ కింద అదనంగా రాష్ట్రాలకు ఈ నిధులను అందజేసింది. ఐదు రాష్ట్రాలకు విడుదల చేసిన రూ. 1,554.99 కోట్లలో అత్యధికంగా ఏపీకి రూ. 608.08 కోట్లు కేటాయించగా, తెలంగాణకు రూ. 231.75 కోట్లు కేటాయించింది. అలాగే నాగాలాండ్‌కు రూ. 170.99 కోట్లు, ఒరిస్సాకు రూ. 255.24 కోట్లు, త్రిపురకు రూ. 288.93 కోట్ల నిధులను కేంద్రం రిలీజ్ చేసింది. గత 2024 సంవత్సరంలో వరదలు, విపత్తు కారణంగా నష్టపోయిన రాష్ట్రాలకు ఇప్పటికే కేంద్రం కొంతమేర నిధులు విడుదల చేసిన విషయం తెలిసిందే. ఇప్పుడు అదనంగా రూ. 1,554.99 కోట్లను విడుదల చేసింది. వరదలు, విపత్తుల వల్ల నష్టపోయిన ప్రాంతాల్లో పర్యటించిన కేంద్ర బృందాలు నివేదికలు ఇచ్చాయి. ఆ మేరకు వివిధ రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం నిధులను విడుదల చేసింది.


ఇవి కూడా చదవండి..

Mahashivaratri: వైభవంగా మల్లన్న బ్రహ్మోత్సవాలు..

Jagan Chilli Issue: మిర్చి వ్యవహారంలో అడ్డంగా బుక్కైన జగన్

Read Latest AP News and Telugu News

Updated Date - Feb 19 , 2025 | 03:32 PM