Jagan Chilli Issue: మిర్చి వ్యవహారంలో అడ్డంగా బుక్కైన జగన్
ABN , Publish Date - Feb 19 , 2025 | 01:45 PM
Jagan Chilli Issue: జగన్ ప్రభుత్వ హయాంలో మిర్చి ధరల విషయంలో జారీ అయిన జీవోలను బయటపెట్టారు అధికారులు. గత ప్రభుత్వ హయాంలో మిర్చి కనీస మద్దతు ధరను రూ.7 వేలుగా నిర్ణయిస్తూ జీవోను జారీ చేసినట్లు తెలిపారు.
అమరావతి, ఫిబ్రవరి 19: మిర్చి ధర వ్యవహారంలో మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్పీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి (Former CM YS Jagan Mohan Reddy) అడ్డంగా బుక్కయ్యారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో మిర్చి కనీస మద్దతు ధర (MSP) రూ. 7 వేలుగా నిర్ణయించింది. ఈ మేరకు 2020 జనవరి 9న జారీ చేసిన జీవోను అధికారులు బయటపెట్టారు. ఈ జీవో జారీ తరువాత ధర పడిపోయిన అప్పటి ప్రభుత్వం (YSRCP Govt) కొనుగోలు చేయలేదని సీఎం చంద్రబాబు నాయుడుకు (CM Chandrababu Naidu) అధికారులు వివరించారు.
ఎమ్‌ఎస్‌పీ కంటే ధరలు పడిపోతే ధరల స్థిరీకరణ నిధి (price stebilisation fund) కింద కొనుగోలు చేస్తామని నాటి ప్రభుత్వం జీవోలో పేర్కొంది. అసలు ధరల స్థిరీకరణ నిధిలో పైసా లేదని అధికారులు వెల్లడించారు. కనీస మద్దుత ధర క్వింటాల్ ఏడువేలుగా నిర్ణయించడంపై ఆనాడే జగన్ ప్రభుత్వ హయాంలోనే రైతులు, నేతలు నిరసనలు చేపట్టారు. నాడు చేసిన నిర్వాకాలు మర్చిపోయి మళ్ళీ రైతుల పరామర్శలు ఏమిటని టీడీపీ నేతలు, రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
కాగా.. ఈరోజు ఉదయం వైసీపీ అధినేత జగన్ గుంటూరు యార్డ్‌కు వెళ్లడం విమర్శలకు దారి తీసింది. ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున రాజకీయ సమావేశాలు, సభలకు అనుమతి లేదని జగన్‌ను మిర్చి యాడ్‌లోకి అనుమతించవద్దని గుంటూరు జిల్లా కలెక్టర్ జారీ చేసిన ఆదేశాలను పట్టించుకోకుండా జగన్ మిర్చియార్డులోకి వెళ్లి రైతులను కలిశారు. మరోవైపు జగన్‌ను చూసి ఆ పార్టీ కార్యకర్తలు, నేతలు జై జగన్ అంటూ నానా హంగామా సృష్టించారు. అనంతరం మీడియాతో మాట్లాడిన జగన్.. అధికారులు, ప్రభుత్వాన్నే తప్పుబట్టారు. ప్రతిపక్ష నేతకు ప్రోటోకాల్ ఇవ్వటంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని వ్యాఖ్యలు చేశారు. వైసీపీ ప్రభుత్వంలో అత్యధిక మద్దతు ధర ఇచ్చి రైతుల్ని ఆదుకున్నామని చెప్పుకొచ్చారు. రాష్ట్రంలో మిర్చి రైతుల పరిస్థితి అధ్వాన్నంగా ఉందంటూ వ్యాఖ్యలు చేశారు జగన్.
ఇవి కూడా చదవండి..
బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..
Mahashivaratri: వైభవంగా మల్లన్న బ్రహ్మోత్సవాలు..
Read Latest AP News and Telugu News