Farmers: కవల గిత్తలకు జన్మదిన వేడుక
ABN, Publish Date - Jan 31 , 2025 | 04:30 AM
రైతుల అభివృద్ధికి పాడి పశువులే ఆధారం. తమ కుటుంబ సభ్యుల వలే.. వాటి ఆలనా పాలనను రైతులు జాగ్రత్తగా చూసుకుంటారు.
ABN AndhraJyothy : రైతుల అభివృద్ధికి పాడి పశువులే ఆధారం. తమ కుటుంబ సభ్యుల వలే.. వాటి ఆలనా పాలనను రైతులు జాగ్రత్తగా చూసుకుంటారు. దీనికి నిదర్శనమే కాకినాడ జిల్లా ప్రత్తిపాడు మండలం చినశంకర్లపూడిలో జరిగిన ఉదంతం. ఈ గ్రామానికి చెందిన మిరియాల వెంకట్రాజు కవలలుగా జన్మించిన ఆవుగిత్తలకు గురువారం మొదటి పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. వాటికి రామ, లక్ష్మణులుగా నామకరణం చేసి, జన్మదిన వేడుక నిర్వహించారు. పది కిలోల కేక్‌ను కట్ చేసి గిత్తలకు తినిపించి, స్థానికులకు పంచి పెట్టారు. ఆతర్వాత వందలాది మందికి విందు భోజనం ఏర్పాటు చేశారు.
- ప్రత్తిపాడు, ఆంధ్రజ్యోతి
Updated Date - Jan 31 , 2025 | 04:30 AM