ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

CM Chandrababu : ఎన్టీఆర్‌.. తెలుగువారి ఆత్మగౌరం

ABN, Publish Date - Jan 19 , 2025 | 03:55 AM

‘ఎన్టీఆర్‌ అంటే మూడు అక్షరాలు కాదు.. తెలుగువారి ఆత్మగౌరవం. పేదవాడి గుండెల్లో తీపి జ్ఞాపకం.

  • పేదవాడి గుండెల్లో తీపి జ్ఞాపకం.. తెలుగుజాతి ఉన్నంత వరకూ ఆ స్థానం సుస్థిరం

  • ఎన్టీఆర్‌ వర్ధంతి సభలో చంద్రబాబు.. ఎన్టీఆర్‌ జీవితం నేటి తరానికి ఆదర్శం: పవన్‌

‘ఎన్టీఆర్‌ అంటే మూడు అక్షరాలు కాదు.. తెలుగువారి ఆత్మగౌరవం. పేదవాడి గుండెల్లో తీపి జ్ఞాపకం. తెలుగుజాతి ఉన్నంత వరకు వారి గుండెల్లో చిరస్థాయిగా నిలుస్తారు. తెలుగుజాతి కోసం పుట్టిన, తెలుగుజాతి ఆత్మగౌరవం కోసం తపించిన ఏకైక నాయకుడు ఎన్టీఆర్‌. పేదరికం లేని సమాజాన్ని నిర్మించాలన్నది ఎన్టీఆర్‌ ఆశయం. ఆయన స్ఫూర్తితో ముందుకు వెళుతున్నాం. పార్టీ పెట్టిన 9 నెలల్లో ప్రపంచంలో ఎవరూ అధికారంలోకి రాలేదు.. అది ఒక్క ఎన్టీఆర్‌కే సాధ్యమైంది. తెలుగువారికి గుర్తింపు తెచ్చిన ఏకైక నాయకుడు ఎన్టీఆర్‌. సంక్షేమానికి అర్థం తెచ్చారు. అభివృద్ధి అంటే చేసి చూపించారు. సంస్కరణలకు నాంది పలికారు. ప్రభుత్వం అంటే పాలకులు కాదు సేవకులు అని చెప్పారు. దేశ చరిత్రలోనే రాజకీయాలకు కొత్త రూపాన్ని ఇచ్చారు. ఆరోజు ఆయన ఇచ్చిన పింఛన్‌ రూ.35.. ఈరోజు రూ.4,000 ఇస్తున్నామంటే అది టీడీపీ చరిత్ర. ఈరోజు మైదుకూరులో బీసీ గెలిచాడంటే అది ఎన్టీఆర్‌ వేసిన పునాది. ఎన్టీఆర్‌ వర్ధంతి సభలో ఒక సంకల్పం చేయాలి. మీ ప్రాంతంలో జీరో పావర్టీని సాధించాలి. ఆర్థిక అసమానతలు లేని సమాజం కోసం సంకల్పం చేసి ముందుకెళ్లాలి’ అని చంద్రబాబు అన్నారు.

Updated Date - Jan 19 , 2025 | 03:55 AM