ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

ఏపీకి మరిన్ని పర్యాటక ప్రాజెక్టులు: కందుల దుర్గేశ్‌

ABN, Publish Date - Feb 19 , 2025 | 06:21 AM

పర్యాటక, సాంస్కృతిక ప్రాజెక్టులు కేటాయించేందుకు కేంద్రం సిద్ధంగా ఉందని కేంద్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి గజేంద్రసింగ్‌ షెకావత్‌ వెల్లడించినట్లు మంత్రి కందుల దుర్గేశ్‌ తెలిపారు.

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 18(ఆంధ్రజ్యోతి): ఏపీకి మరిన్ని పర్యాటక, సాంస్కృతిక ప్రాజెక్టులు కేటాయించేందుకు కేంద్రం సిద్ధంగా ఉందని కేంద్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి గజేంద్రసింగ్‌ షెకావత్‌ వెల్లడించినట్లు మంత్రి కందుల దుర్గేశ్‌ తెలిపారు. మంగళవారం ఆయన ఢిల్లీలో కేంద్రమంత్రిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా.. ఏపీకి శాస్కి స్కీమ్‌ ద్వారా అఖండ గోదావరి, గండికోట ప్రాజెక్టులకు నిధులు కేటాయించినందుకు ధన్యవాదాలు తెలిపారు. రాష్ట్రంలో పలు పర్యాటక, సాంస్కృతిక ప్రాజెక్టులకు ఆమోదం తెలపాలని కోరగా కేంద్ర మంత్రి సానుకూలంగా స్పందించినట్లు దుర్గేశ్‌ తెలిపారు. బుద్ధిస్ట్‌ సర్క్యూట్‌లో భాగంగా ఏపీకి ఒక సర్క్యూట్‌ కేటాయిస్తామని వెల్లడించినట్లు చెప్పారు.

Updated Date - Feb 19 , 2025 | 06:21 AM