ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

TDP : ఉక్కుమంత్రికి కూటమి ఎంపీల కృతజ్ఞతలు

ABN, Publish Date - Feb 01 , 2025 | 04:47 AM

విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ పరిరక్షణకు కేంద్రం రూ.11,440 కోట్ల ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించడం, స్టీల్‌ ప్లాంట్‌ను ఉక్కు మంత్రి హెచ్‌డీ కుమారస్వామి సందర్శించిన నేపథ్యంలో ఆయనకు కూటమి ఎంపీలు..

న్యూఢిల్లీ, జనవరి 31(ఆంధ్రజ్యోతి): విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ పరిరక్షణకు కేంద్రం రూ.11,440 కోట్ల ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించడం, స్టీల్‌ ప్లాంట్‌ను ఉక్కు మంత్రి హెచ్‌డీ కుమారస్వామి సందర్శించిన నేపథ్యంలో ఆయనకు కూటమి ఎంపీలు కృతజ్ఞతలు తెలిపారు. శుక్రవారం, పార్లమెంటు హౌస్‌లో కేంద్ర మంత్రి హెచ్‌డీ కుమారస్వామి, ఉక్కు సహాయ మంత్రి శ్రీనివాస వర్మను కూటమి ఎంపీల బృందం మర్యాదపూర్వకంగా కలిసి వారికి రాష్ట్ర ప్రజల తరఫున, రాష్ట్రప్రభుత్వం తరఫున కృతజ్ఞతలు తెలిపారు. కేంద్ర మంత్రులు కె.రామ్మోహన్‌నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్‌, ఎంపీలు బీదా మస్తాన్‌రావు, కలిశెట్టి అప్పలనాయుడు, కృష్ణప్రసాద్‌, కేశినేని చిన్ని, జనసేన ఎంపీలు బాలశౌరి, తంగెళ్ల ఉదయకృష్ణ తదితరులు హెచ్‌డీ కుమారస్వామిని కలిశారు. ఏపీలో ప్రతి జిల్లానూ అభివృద్ధి పథంలో ముందుకు నడిపేందుకు సీఎం చంద్రబాబు కృషి చేస్తున్నారని టీడీపీ పార్లమెంటరీ పార్టీ నేత లావు శ్రీకృష్ణ దేవరాయలు అన్నారు. కేంద్ర బడ్జెట్‌లో ఏపీకి మంచి కేటాయింపులు ఉంటాయని భావిస్తున్నామని తెలిపారు.


For AndhraPradesh News And Telugu News

Updated Date - Feb 01 , 2025 | 04:47 AM