Budget 2025: బడ్జెట్ 2025పై ఎన్నో ఆశలు.. ఏపీకి వరాలు కురిపించేనా..
ABN, Publish Date - Feb 01 , 2025 | 08:50 AM
మరికొద్ది సేపట్లో ప్రకటించనున్న బడ్జెట్ 2025లో ఏపీకి ప్రాధాన్యత ఇచ్చే అవకాశం ఉందా. ఎన్డీయే కూటమి ప్రభుత్వం కావడంతో పెండింగ్ ప్రాజెక్టులకు నిధులు కేటాయించే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. ఆ విశేషాలేంటో ఇక్కడ చూద్దాం.
బడ్జెట్ 2025పై (Budget 2025) ఆసక్తి నెలకొన్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌కు (Andhra Pradesh) సంబంధించి అనేక ఆసక్తికరమైన అంశాలు ఉన్నాయి. రాష్ట్రానికి ఈ బడ్జెట్‌లో ఎక్కువ నిధులు కేటాయించే అవకాశాలు ఉన్నాయా అనే చర్చ పెరిగింది. ప్రస్తుతం ఎన్డీయే కూటమి ప్రభుత్వం ఉండటంతో, గతంలో పెండింగ్‌లో ఉన్న ప్రాజెక్టులకు నిధులు కేటాయించే అవకాశం ఉందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. గత ఏడాది బడ్జెట్‌లో ఏపీ అమరావతి కొత్త రైల్వే లైన్‌కి కొంత నిధులు కేటాయించారు. కానీ ఈసారి మాత్రం ప్రత్యేకంగా అమరావతి రైల్వే లైన్‌కు పెద్ద మొత్తంలో నిధులు కేటాయించనున్నట్లు తెలుస్తోంది.
పవన్ కళ్యాణ్ కూడా..
ఈ ప్రాజెక్టు పూర్తయ్యేందుకు పెద్ద మొత్తంలో నిధులు అవసరం. ఆ ప్రక్రియను వేగవంతం చేయడానికి ఈ బడ్జెట్‌లో దీనికి పెద్ద నిధులు కేటాయించే అవకాశం ఉంది. అంతేకాకుండా దశాబ్దానికి పైగా పూర్తికాని కోటిపల్లి-నరసాపురం రైల్వే లైన్‌కి కూడా ఈ బడ్జెట్‌లో నిధులు కేటాయించే అవకాశం ఉంది. గతంలో ఈ ప్రాజెక్టు పురోగతిని గమనించి, పవన్ కళ్యాణ్ కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ఈ క్రమంలో ఈ ప్రాజెక్టుకు నిధులు కేటాయించడం ద్వారా ఆంధ్రప్రదేశ్‌లో రవాణా వ్యవస్థను మెరుగుపడనుంది.
ఎన్డీయే ప్రభుత్వంపై అంచనాలు
ఇప్పుడు ఎన్డీయే కూటమి ప్రభుత్వం ఉండడంతో, ఆంధ్రప్రదేశ్‌కు ఎంతో అవసరమైన ప్రాజెక్టుల పైన అధిక ప్రాధాన్యత ఇచ్చే అవకాశం ఉంది. కేంద్రంతో మంచి సంబంధాలు ఉన్న పార్టీలు, ముఖ్యంగా టీడీపీ, బీజేపీ, రాష్ట్ర ప్రయోజనాల కోసం మరింత శ్రద్ధ పెడతాయన్న సంకేతాలు ఉన్నాయి. ఈ బడ్జెట్‌లో ఇప్పటికే కొన్ని కీలక ప్రాజెక్టులకు నిధులు కేటాయించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉన్నట్టు అంచనాలు ఉన్నాయి. దీంతో రాష్ట్రానికి మరింత అభివృద్ధి, ఆర్థిక సవాళ్ల నుంచి ఉపశమనం కలుగుతుందని భావిస్తున్నారు. ఈ క్రమంలో ఈరోజు ఏపీకి ఈ బడ్జెట్ నుంచి ఎంత ప్రయోజనం కలగుతుందో అనేది ఓ వైపు రాజకీయంగా, మరోవైపు ఆర్థిక రంగాలలో ఆసక్తిని పుట్టించే అంశంగా నిలిచింది.
ఇవీ చదవండి:
Chandrababu Naidu: నేడు అన్నమయ్యజిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటన.. కారణమిదే..
సచిన్‌కు ప్రతిష్టాత్మక పురస్కారం.. ఈ అవార్డు చాలా స్పెషల్
ఒకే రోజు ముగ్గురు స్టార్ల సెంచరీలు మిస్.. ఇది ఊహించలేదు
చాంపియన్స్ ట్రోఫీకి ముందు ఆసీస్‌కు బిగ్ షాక్.. అసలైనోడు దూరం
మరిన్ని తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి
Updated Date - Feb 01 , 2025 | 08:50 AM