ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

BSNL Pensioners : ముఖ్యమంత్రి సహాయనిధికి బీఎస్ఎన్‌ఎల్‌ పెన్షనర్స్‌ 10.46 లక్షల విరాళం

ABN, Publish Date - Jan 29 , 2025 | 06:04 AM

విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్‌ నేతృత్వంలో అసోసియేషన్‌ ప్రతినిధులు మంగళవారం ఉండవల్లి నివాసంలో సీఎం చంద్రబాబును కలిసి, రూ.10,46,169 చెక్కు అందజేశారు.

అమరావతి, జనవరి 28 (ఆంధ్రజ్యోతి): ముఖ్యమంత్రి సహాయ నిధికి ఆలిండియా బీఎస్ఎన్‌ఎల్‌ పెన్షనర్స్‌ వెల్ఫేర్‌ అసోసియేషన్‌ రూ.10.46 లక్షల విరాళాన్ని అందజేసింది. విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్‌ నేతృత్వంలో అసోసియేషన్‌ ప్రతినిధులు మంగళవారం ఉండవల్లి నివాసంలో సీఎం చంద్రబాబును కలిసి, రూ.10,46,169 చెక్కు అందజేశారు. గతేడాది విజయవాడలో వరదలకు సర్వం కోల్పోయిన బాధితులను ఆదుకునేందుకు తమ వంతు విరాళం ఇచ్చినట్టు అసోసియేషన్‌ ప్రతినిధులు డి.గోపాలకృష్ణ, వరప్రసాద్‌ తెలిపారు. ఈ సందర్భంగా అసోసియేషన్‌ను చంద్రబాబు అభినందించారు.

  • మంత్రి లోకేశ్‌కు విరాళాల అందజేత

పేదల ఆకలి తీరుస్తున్న అన్న క్యాంటీన్ల నిర్వహణకు, ముఖ్యమంత్రి సహాయ నిధికి పలువురు దాతలు మంత్రి నారా లోకేశ్‌కు విరాళాలు అందజేశారు. మంగళవారం ఉండవల్లిలో నిర్వహించిన ప్రజాదర్బార్‌లో ఆయనకు విరాళాల చెక్కులు అందజేశారు. అన్న క్యాంటీన్ల నిర్వహణ నిమిత్తం ఏలూరుకు చెందిన గుత్తా స్వరూపారాణి రూ.లక్ష, గుత్తా వెంకట కృష్ణారావు రూ.50వేలు, గుత్తా శారదాదేవి రూ.50వేలు ఇవ్వగా, చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గానికి చెందిన జొన్నలగడ్డ శేఖర్‌ రూ.10 వేల చెక్కు సీఎంఆర్‌ఎ్‌ఫకు ఇచ్చారు. దాతలను మంత్రి లోకేశ్‌ అభినందించారు.


For AndhraPradesh News And Telugu News

Updated Date - Jan 29 , 2025 | 06:04 AM