AP Government : ప్రభుత్వ భూముల రిజిస్ట్రేషన్లు రద్దు!
ABN, Publish Date - Mar 06 , 2025 | 04:09 AM
అన్యాక్రాంతమైన ప్రభుత్వ భూములను పరిరక్షించేందుకు కూటమి ప్రభుత్వం సిద్ధమవుతోంది. అక్రమంగా రిజిస్ర్టేషన్లు జరిగిన ప్రభుత్వ భూములను గుర్తించి, ఆ రిజిస్ట్రేషన్లను రద్ద్దుచేసే దిశగా చర్యలు చేపడుతోంది.
అక్రమాలను గుర్తించేందుకు చర్యలు
రద్దుపై కలెక్టర్లదే తుది నిర్ణయం
ఫార్మాట్ పంపనున్న సర్కారు
కలెక్టర్ తరఫున రద్దు ప్రక్రియ
పూర్తి చేసే బాధ్యత తహశీల్దార్‌కు
నేడో, రేపో ప్రభుత్వ ఉత్తర్వులు జారీ
అమరావతి, మార్చి 5(ఆంధ్రజ్యోతి): అన్యాక్రాంతమైన ప్రభుత్వ భూములను పరిరక్షించేందుకు కూటమి ప్రభుత్వం సిద్ధమవుతోంది. అక్రమంగా రిజిస్ర్టేషన్లు జరిగిన ప్రభుత్వ భూములను గుర్తించి, ఆ రిజిస్ట్రేషన్లను రద్ద్దుచేసే దిశగా చర్యలు చేపడుతోంది. దీంతో ఆ భూములు తిరిగి ప్రభుత్వ పరిధిలోకి వస్తాయి. దీనిపై ప్రభుత్వం గురువారం అధికారికంగా ఆదేశాలు జారీ చేసే అవకాశం ఉంది. రిజిస్ర్టేషన్లు జరిగిన ప్రభుత్వ భూములను వివిధ మార్గాల్లో గుర్తిస్తారు. ప్రజలు తమకు తెలిసి రిజిస్ర్టేషన్లు జరిగిన ప్రభుత్వ భూముల వివరాలతో కలెక్టర్ కార్యాలయంలో ఫిర్యాదు చేయవచ్చు. ఈ ఫిర్యాదులను పూర్తిస్థాయిలో పరిశీలించి కలెక్టర్ రిజిస్ట్రేషన్ల రద్దుపై తుది నిర్ణయం తీసుకుంటారు. రిజిస్ర్టేషన్ చట్టం 1908లోని రూల్ 26(కె) (ఐ) ప్రకారం కలెక్టర్లు అన్యాక్రాంతమైన ప్రభుత్వ భూము ల దొంగ రిజిస్ర్టేషన్లు రద్దు చేయవచ్చు. ప్రభుత్వ భూమేనని కలెక్టర్ నిర్ధారించుకున్న తర్వాత తహశీల్దార్ సంబంధిత సబ్‌రిజిస్ర్టార్ కార్యాలయంలో ఆ భూమి రిజిస్ర్టేషన్ రద్దు పత్రాలు సమర్పించి, రద్దు ప్రక్రియ పూర్తి చేస్తారు. ఒకవేళ ఆ భూమిలో నిర్మాణాలున్నప్పటికీ కూడా రిజిస్ర్టేషన్లను రద్దు చేసి ప్రభుత్వ భూముల జాబితాలో చేర్చుతారు. అంతకుముందు రిజిస్ర్టేషన్ చేసుకున్న ప్రైవేట్ వ్యక్తులు కోర్టుకు వెళ్తే, ప్రభుత్వం ముందుగా రిజిస్ర్టేషన్లు రద్దు చేసి తర్వాత కోర్టులో కౌంటర్ వేయాలని నిర్ణయించారు. ఇందుకోసం 26 జిల్లాల కలెక్టర్లకు ప్రభుత్వం ఒక ఫార్మాట్ పంపిస్తుంది. కలెక్టర్లు తమ జిల్లాల్లో గుర్తించిన అన్యాక్రాంతమైన ప్రభుత్వ భూముల వివరాలను ఆ ఫార్మాట్‌లో ప్రభుత్వానికి పంపాల్సి ఉంటుంది.
Updated Date - Mar 06 , 2025 | 04:09 AM