ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

AP Govt : క్లీన్‌ ఎనర్జీలో పెట్టుబడులకు ఆమోదం

ABN, Publish Date - Feb 08 , 2025 | 04:51 AM

ప్రభుత్వం ఇంధనోత్పత్తి సంస్థలను ప్రోత్సహిస్తోంది. గురువారం మంత్రివర్గ సమావేశంలో క్లీన్‌ ఎనర్జీ ప్రాజెక్టులకు ఆమోదం లభించింది.

అనంత, సత్యసాయి జిల్లాల్లో మూడు పవన విద్యుత్‌ ప్లాంట్లు

అమరావతి, ఫిబ్రవరి 7(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో క్లీన్‌ ఎనర్జీ రంగంలో రూ.10వేల కోట్ల పెట్టుబడులు.. 7.5 లక్షల మందికి ఉద్యోగాల కల్పనే లక్ష్యంగా ప్రభుత్వం ఇంధనోత్పత్తి సంస్థలను ప్రోత్సహిస్తోంది. గురువారం మంత్రివర్గ సమావేశంలో క్లీన్‌ ఎనర్జీ ప్రాజెక్టులకు ఆమోదం లభించింది. మూడు సంస్థల పెట్టుబడులకు అనుమతిస్తూ కేబినెట్‌ తీసుకున్న నిర్ణయాన్ని అమల్లోకి తెస్తూ ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి హోదాలో సీఎస్‌ కె.విజయానంద్‌ శుక్రవారం ఉత్తర్వు జారీచేశారు. శ్రీసత్యసాయి జిల్లాలో ఎలక్కుంట్ల, ముత్తవకుంట్ల, రామగిరి, నసనకోట గ్రామాల పరిధిలో 231 మెగావాట్ల పవన్‌విద్యుత్‌ ప్లాంట్ల ఏర్పాటుకు కడప రెన్యువబుల్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌కు అనుమతిచ్చారు. అనంతపురం జిల్లా బ్రహ్మసముద్రం, కల్యాణదుర్గం, శెట్టూరు మండలాల పరిధిలో 178.20 మెగావాట్ల విండ్‌ పవర్‌ ప్రాజెక్టు స్థాపనకు మెస్సర్స్‌ అనంతపూర్‌ రెన్యువబుల్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ ప్రతిపాదనకు ఆమోదముద్ర వేశారు. శ్రీసత్యసాయి, అనంతపురం జిల్లాల్లోని మోటారు చింతలపల్లి (ఎంసీ పల్లి), కురాకులపల్లి, పేరూరు, కొండాపురం, మక్కినవారిపల్లి గ్రామాల్లో మెస్సర్స్‌ అస్పిరి రెన్యువబుల్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ 118.80 మెగావాట్ల విండ్‌ పవర్‌ ప్రాజెక్టు స్థాపనకు ఆమోదం తెలుపుతున్నట్లు ఇంధనశాఖ ఉత్తర్వుల్లో పేర్కొంది.


ఈ వార్తలు కూడా చదవండి:

NTR District: మరో వివాదంలో చిక్కుకున్న ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు..

Cabinet Decisions: కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయం.. విశాఖ కేంద్రంగా సౌత్ కోస్ట్ రైల్వే జోన్‍కు ఆమోదం

Updated Date - Feb 08 , 2025 | 04:51 AM