ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

AP Govt : స్వీయ ధ్రువీకరణ చాలు

ABN, Publish Date - Feb 05 , 2025 | 05:40 AM

మున్సిపల్‌ కార్యాలయాల చుట్టూ తిరిగే ఇబ్బందులు లేకుండా, సిబ్బందికి ముడుపులు సమర్పించుకునే బాధలు లేకుండా పకడ్బందీ విధానాన్ని అమల్లోకి తెచ్చింది.

  • భవన నిర్మాణాల అనుమతులు ఇక సులభం

అమరావతి, ఫిబ్రవరి 4(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోని పట్టణ ప్రాం తాల్లో భవన నిర్మాణ అనుమతులను ప్రభుత్వం సులభతరం చేసింది. మున్సిపల్‌ కార్యాలయాల చుట్టూ తిరిగే ఇబ్బందులు లేకుండా, సిబ్బందికి ముడుపులు సమర్పించుకునే బాధలు లేకుండా పకడ్బందీ విధానాన్ని అమల్లోకి తెచ్చింది. ఆన్‌లైన్‌లో స్వీయ ధ్రువీకరణ ద్వారా భవ న, భూ యజమానులు అనుమతి తీసుకునేందుకు వెసులుబాటు కల్పించారు. ఇటీవల అసెంబ్లీలో చట్టం చేసిన తర్వాత సెల్ప్‌ సర్టిఫికేషన్‌ స్కీం(సీసీఎ్‌స)ను అమలు చేసేందుకు మున్సిపల్‌ శాఖ మార్గదర్శకాలు విడుదల చేసింది. సీఆర్‌డీఏ మినహా అన్నిచోట్లా అనుమతు లు జారీచేసే అధికారాన్ని పట్టణాభివృద్ధి అథారిటీల పరిధి నుంచి పట్టణ స్థానిక సంస్థలకు బదిలీ చేశారు. 300 చదరపు మీటర్లకు మించని ప్రదేశాల్లో నిర్మాణాలకు యజమానులే ప్లాన్‌ను ధ్రువీకరించి, దరఖాస్తు చేసుకుసేలా చట్టంలో మార్పులు చేశారు. యజమానులే కాకుండా ఆర్కిటెక్ట్‌, ఇంజనీర్లు, టౌన్‌ప్లానర్లు కూడా దరఖాస్తు చేయవచ్చు. లైసెన్సుడ్‌ టెక్నికల్‌ పర్సన్‌లు కూడా ఇంటి ప్లాన్‌ను ధ్రువీకరించి అప్‌లోడ్‌ చేయవచ్చు. బహుళ అంతస్థులు కాని(నాన్‌-హైరైజ్‌డ్‌) నివాస భవనాలకు మాత్రమే ఈ వెసులుబాటు ఉంటుంది. ఈ మేరకు ఏపీ మున్సిపల్‌, టౌన్‌ప్లానింగ్‌ చట్టాల్లో మార్పులు చేశారు. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించే భవన యజమానులపై కఠిన చర్యలు తీసుకుంటారు.


ఈ వార్తలు కూడా చదవండి..

సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక సమావేశం

శ్రీకాకుళం పట్టణానికి కొత్త శోభ: రామ్మోహన్ నాయుడు

తెలంగాణ ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో భారీ ఊరట

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated Date - Feb 05 , 2025 | 05:40 AM