Liquor Sales: 10 రోజుల్లో 15 వందల కోట్లు
ABN, Publish Date - Oct 13 , 2024 | 07:06 PM
దసరా పండగ వేళ తెలంగాణ రాష్ట్రంలో మద్యం విక్రయాలు జోరుగా జరిగాయి. సీజన్‌లో 20 నుంచి 25 శాతం ఎక్కువగా లిక్కర్ సేల్స్ జరిగాయి. గత మూడు రోజుల నుంచి మద్యం విక్రయాలు పెరిగాయి.
Liquor Sales In Telangana
దసరా పండగ వేళ తెలంగాణ రాష్ట్రంలో మద్యం విక్రయాలు జోరుగా జరిగాయి. సీజన్‌లో 20 నుంచి 25 శాతం ఎక్కువగా లిక్కర్ సేల్స్ జరిగాయి. గత ఏడాదితో పోల్చి చూస్తే 15 శాతం విక్రయాలు పెరిగాయి. గత మూడు రోజుల నుంచి మద్యం విక్రయాలు పెరిగాయి. రోజు రూ.120 కోట్లకు పైగా సేల్స్ జరిగాయి. శనివారం రోజు దసరా పండగ సందర్భంగా 200 కోట్ల వ్యాపారం జరిగింది. 1వ తేదీ నుంచి 11వ తేదీ వరకు రూ.1150 కోట్ల బిజినెస్ జరిగిందని ఎక్సైజ్ అధికారులు చెబుతున్నారు. ఆదివారం (13వ తేదీ) విక్రయాలు మరింత ఎక్కువ జరిగే అవకాశం ఉందని అంచనా వేశారు.
Updated Date - Oct 13 , 2024 | 07:24 PM