బుడమేరు సక్సెస్.. ఫలించిన కష్టం..
ABN, Publish Date - Sep 10 , 2024 | 08:55 AM
విజయవాడ: నిన్నటి వరకు వరద నీటిలో నానిన విజయవాడలోని ముంపు ప్రాంతాలన్నీ కుదుటపడ్డాయి. బుడమేరు ఇన్‌ఫ్లో రెండు వేల క్యూసెక్కుల లోపే ఉండటం.. ఎగువ ప్రాంతాల్లో పెద్దగా వర్షం పడే అవకాశాలు లేకపోవడంతో విజయవాడకు ముప్పు దాదాపు తప్పినట్లేనని స్థానికులు భావిస్తున్నారు.
విజయవాడ: నిన్నటి వరకు వరద నీటిలో నానిన విజయవాడలోని ముంపు ప్రాంతాలన్నీ కుదుటపడ్డాయి. బుడమేరు ఇన్‌ఫ్లో రెండు వేల క్యూసెక్కుల లోపే ఉండటం.. ఎగువ ప్రాంతాల్లో పెద్దగా వర్షం పడే అవకాశాలు లేకపోవడంతో విజయవాడకు ముప్పు దాదాపు తప్పినట్లేనని స్థానికులు భావిస్తున్నారు. మరోవైపు బుడమేరు డైవర్షన్ చానల్ గండ్లు పూడ్చివేసిన అధికారులు కట్టను బలోపేతంచేసి గండ్లు పూడ్చిన ప్రాంతాల్లో సీపేజీని అరికట్టే ప్రయత్నాల్లో నిమగ్నమయ్యారు. మంగళవారం నాటికి ఈ పనులు కొలిక్కి వచ్చే అవకాశం ఉంది. సీపేజీ నివారణకు జియో టెక్సటైల్ మెటీరియల్ వినియోగిస్తున్నారు. తొలుత గండ్లు పడిన రెండు ప్రాంతాల్లో సీపేజీ 500 క్యూసెక్కులు ఉండగా అది 200 క్యూసెక్కులకు తగ్గింది. కట్ట పటిష్ఠతను పెంచేందుకు గండ్లుపడిన చోట 5.7 మీటర్ల ఎత్తును... మరో 0.3 మీటర్ల ఎత్తుకు పెంచుతున్నారు. మెగా ఇంజనీరింగ్ కంపెనీ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ పనుల్లో సుమారు 300 మంది నిమగ్నమయ్యారు.
ఫలించిన కష్టం..
బుడమేరు వరద సెప్టెంబరు 1వ తేదీన నగరాన్ని ముంచెత్తడంతో నగరవాసులు ఉక్కిరిబిక్కిరి అయ్యారు. ఊహించని విపత్తుకు జిల్లా అధికారయంత్రాంగం కూడా చేతులెత్తేసిన పరిస్థితి! అలాంటి సమయంలో రంగంలోకి దిగిన సీఎం చంద్రబాబు...జిల్లా కలెక్టరేట్‌లోనే మకాం వేసి మంత్రులను, రాష్ట్రస్థాయి, జిల్లా స్థాయి అధికారులను పరుగులు పెట్టించారు. రాష్ట్రవ్యాప్తంగా వివిధ శాఖల సిబ్బందిని విజయవాడ రప్పించి వరద సహాయక చర్యలను ముమ్మరం చేశారు. దాని ఫలితమే అటు వరద నీరు తగ్గుముఖం పడుతున్న సమయంలోనే ముంపు ప్రాంతాల్లో ముప్పేట సహాయక చర్యలకు అవకాశం లభించింది. మొత్తం మీద వారంరోజులుపైగా సీఎం, మంత్రులు, ఇతర ప్రజాప్రతినిధులు పడిన కష్టానికి ఫలితం దక్కింది.
ఈ వార్తలు కూడా చదవండి..
వారిని ఎందుకు అరెస్ట్ చేయలేకపోతున్నారు?
బీజేపీలో చేరే ప్లాన్‌లో మాఫియా డాన్..!
వరద సహాయక చర్యల్లో మంత్రి నారాయణ
Read Latest AP News and Telugu News
Read Latest Telangana News and National News
Read Latest Chitrajyothy News and Sports News
Updated Date - Sep 10 , 2024 | 08:55 AM