వారిని ఎందుకు అరెస్ట్‌ చేయలేకపోతున్నారు?

ABN, Publish Date - Sep 10 , 2024 | 08:30 AM

అమరావతి: గత వైసీపీ ప్రభుత్వంలో పోలీసులు అర్ధరాత్రి అని చూడకుండా గోడలు దూకి మరీ టీడీపీ నేతలు, కార్యకర్తలు, సానుభూతి పరులను అరెస్ట్‌ చేశారు. పైనుంచి ఆదేశాలు రావడమే ఆలస్యమన్నట్టు టార్గెట్‌ చేసి కేసులు పెట్టి వేధించారు. అలాంటిది పట్ట పగలే నానా బీభత్సం సృష్టించిన వైసీపీ నేతలు, కార్యకర్తలను ఇప్పుడు పోలీసులు ఎందుకు అరెస్ట్‌ చేయలేకపోతున్నారు?

అమరావతి: గత వైసీపీ ప్రభుత్వంలో పోలీసులు అర్ధరాత్రి అని చూడకుండా గోడలు దూకి మరీ టీడీపీ నేతలు, కార్యకర్తలు, సానుభూతి పరులను అరెస్ట్‌ చేశారు. పైనుంచి ఆదేశాలు రావడమే ఆలస్యమన్నట్టు టార్గెట్‌ చేసి కేసులు పెట్టి వేధించారు. అలాంటిది పట్ట పగలే నానా బీభత్సం సృష్టించిన వైసీపీ నేతలు, కార్యకర్తలను ఇప్పుడు పోలీసులు ఎందుకు అరెస్ట్‌ చేయలేకపోతున్నారు? రోజులు, నెలలు గడుస్తున్నా వారిని పట్టుకోవడంలో ఎందుకు విఫలమవు తున్నారు? టీడీపీ కేంద్ర కార్యాలయం విధ్వంసం, నాటి ప్రతిపక్షనేత చంద్రబాబు ఇంటిపై దాడి కేసుల్లో కీలక నిందితులను ఇప్పటికీ పట్టుకోలేదు!


అలాగే పోలింగ్‌ రోజున పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గంలో పెద్ద ఎత్తున హింసాకాండకు పాల్పడిన మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి సోదరుడు వెంకట్రామిరెడ్డి పరారీ అయి దాదాపు 4 నెలలు అవుతున్నా పోలీసులు అరెస్ట్‌ చేయలేకపోతున్నారు. ఈ కేసుల్లో నిందితులు అరెస్ట్‌ కాకుండా కోర్టు నుంచి ఎలాంటి రక్షణ లేకపోయినా పోలీసులు పట్టుకోలేకపోతున్నారు. నిందితులు పారిపోయారా? లేదంటే పారిపోయేందుకు పోలీసులు సహకరించారా? పారిపోతారని తెలిసినా కళ్లు మూసుకున్నారా? పారిపోయిన వాళ్లను పట్టుకునే శక్తి సామర్థ్యాలు పోలీస్‌ శాఖకు లేవా? ఇలా ఎన్నో ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి.


ఈ వార్తలు కూడా చదవండి..

బీజేపీలో చేరే ప్లాన్‌లో మాఫియా డాన్‌..!

వరద సహాయక చర్యల్లో మంత్రి నారాయణ

కోర్టుకు రావడానికి జగన్‌కు నామోషీ!

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated at - Sep 10 , 2024 | 08:30 AM