నందిగామలో తగ్గిన వరద ప్రవాహం..
ABN, Publish Date - Sep 03 , 2024 | 12:40 PM
ఎన్టీఆర్ జిల్లా: నందిగామలో వైరా, మునేరు, కట్టలేరు వరద ప్రవాహం తగ్గింది. కీసర బ్రిడ్జి వద్ద సుమారు 12 అడుగుల మేర వరద ప్రవాహం తగ్గింది. మునేరు వరద ప్రవాహం తగ్గడంతో నందిగామ మండలం, అయితవరం వద్ద జాతీయ రహదారిపై రాకపోకలు కొనసాగుతున్నాయి.
ఎన్టీఆర్ జిల్లా: నందిగామలో వైరా, మునేరు, కట్టలేరు వరద ప్రవాహం తగ్గింది. కీసర బ్రిడ్జి వద్ద సుమారు 12 అడుగుల మేర వరద ప్రవాహం తగ్గింది. మునేరు వరద ప్రవాహం తగ్గడంతో నందిగామ మండలం, అయితవరం వద్ద జాతీయ రహదారిపై రాకపోకలు కొనసాగుతున్నాయి. జాతీయ రహదారి మార్జిన్‌లో 10 అడుగుల మేర రోడ్డు కోతకు గురైంది. వరద ప్రవాహానికి 12 కారులు, ఒక ఆటో, ఆరు బైకులు కొట్టుకుపోయాయి. వరద ప్రవాహానికి జాతీయ రహదారిపై చెత్తా చెదారం పెరిగిపోయింది. పంట పొలాలు దెబ్బతినడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు.
కాగా రెండు రోజులుగా వణికిస్తున్న వరద ఉధృతికి సుమారు 2 లక్షల 70 వేల మంది ముంపు బారిన పడగా సోమవారం నాటికి 70 వేల మందిని సహాయక శిబిరాలకు తరలించారు. మరో 2 లక్షల మంది ఇంకా ముంపులోనే ఉన్నారు. వారికి ఆహారం, తాగునీరు అందించే ప్రక్రియ నడుస్తోంది. కృష్ణా నదికి 11లక్షల 40 వేల క్యూసెక్కుల వరద రావడంతో విజయవాడలోని భవానీపురం, బ్యారేజ్ దిగువన ఉన్న రామలింగేశ్వర నగర్ ప్రాంతాలు మునిగిపోయాయి. కృష్ణనది వరద ఉధృతి ఎక్కువగా ఉండడంతో ప్రకాశం బ్యారేజ్ నుంచి వరద బయటకు వచ్చి వేంపార్కును ముంచేసింది. జాతీయ రహదారి మీదుగా భవానీపురంలోకి వరద ప్రవేశించడంతో ఆ ప్రాంతంలో మూడడుగులమేర వరద నిలిపోయింది.
ఈ వార్తలు కూడా చదవండి..
వరద ప్రభావిత ప్రాంతాల్లో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన
శాంతించిన మున్నేరు.. వాహనాల పునరుద్ధరణ..
ప్రధాని మోదీకి సీఎం రేవంత్ రెడ్డి లేఖ..
Read Latest AP News and Telugu News
Read Latest Telangana News and National News
Read Latest Chitrajyothy News and Sports News
Updated Date - Sep 03 , 2024 | 12:40 PM