అందుకే విశాఖ ఎమ్మెల్సీ ఎన్నికకు దూరం..
ABN, Publish Date - Aug 13 , 2024 | 01:55 PM
రాజకీయాల్లో విలువలు శాశ్వతమనే ఆలోచనతో ఉత్తరాంధ్ర ఎమ్మెల్సీ (స్థానిక సంస్థల కోటా) ఉప ఎన్నికల్లో దూరంగా ఉండాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారని ఏపీ టీడీపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు తెలియజేశారు.
విశాఖ: ఉత్తరాంధ్ర ఎమ్మెల్సీ (స్థానిక సంస్థల కోటా) ఉప ఎన్నికల్లో (MLC by-Election) పోటీకి దూరంగా ఉండాలని తెలుగుదేశం ‘కూటమి’ (TDP Kutami) నిర్ణయం తీసుకుంది. విజయం సాధించేందుకు అవసరమైన బలం లేనందున పోటీ చేయకపోవడమే మంచిదని మెజారిటీ నేతలు అభిప్రాయపడినట్టు చెబుతున్నారు. ఈ సందర్బంగా మంగళవారం విశాఖ (Visakha)లో ఏపీ టీడీపీ అధ్యక్షుడు (AP TDP Chief) పల్లా శ్రీనివాసరావు (Palla Srinivasarao) మీడియాతో మాట్లాడుతూ.. రాజకీయాల్లో విలువలు శాశ్వతమనే ఆలోచనతో సీఎం చంద్రబాబు (CM Chandrababu) ఈ నిర్ణయం తీసుకున్నారని తెలియజేశారు. కూటమి అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి ప్రజాస్వామ్య విలువలు కాపాడాలనే విధంగా నిర్ణయాలు తీసుకోవడం జరుగుతోందన్నారు. గతంలో జగన్ (Jagan) అధికారమే శాశ్వతం అనే విధంగా ప్రతిపక్ష నేతల గొంతునొక్కి, అక్రమ కేసులు, అరెస్టు చేసిన విషయం అందరికీ తెలిసిందేనన్నారు. అలా నియంత పోకడలకు వెళ్లిన వారికి ప్రజలు బుద్ది చెప్పిన విషయం కూడా తెలిసిందేనన్నారు. అందుకే చంద్రబాబు ప్రజాస్వామ్యానికి విలువ ఇస్తూ ఎమ్మెల్సీ ఉప ఎన్నిక పోటీకి దూరంగా ఉండాలని నిర్ణయం తీసుకున్నారని పల్లా శ్రీనివాసరావు స్పష్టం చేశారు.
ఈ వార్తలు కూడా చదవండి..
దీక్షకు దిగిన మహిళకు మంత్రి లోకేష్ అండ..
జోగీ రమేష్ కుమారుడు రాజీవ్ అరెస్ట్..
విజయవాడలో 'తంగలాన్' మూవీ టీమ్ సందడి..
దువ్వాడపై మంత్రి ఆనం ఘాటు వ్యాఖ్యలు
Read Latest AP News and Telugu News
Read Latest Telangana News and National News
Read Latest Chitrajyothy News and Sports News
Updated Date - Aug 13 , 2024 | 11:32 PM