భక్తులకు ఖైరతాబాద్ గణేష్ దర్శనం..
ABN, Publish Date - Sep 06 , 2024 | 01:49 PM
హైదరాబాద్: ఖైరతాబాద్ గణపతి భక్తులకు దర్శనమిస్తున్నారు. చవితికి ఒక్కరోజు ముందునుంచే భక్తులకు గణపయ్య కనువిందు చేస్తున్నారు. ఈ ఏడాది 70 అడుగుల ఎత్తులో సప్తముఖశక్తి మహాగణపతిగా దర్శనమిస్తున్న గణేష్‌ను దర్శించుకునేందుకు భక్తులు బారులు తీరుతున్నారు.
హైదరాబాద్: ఖైరతాబాద్ గణపతి భక్తులకు దర్శనమిస్తున్నారు. చవితికి ఒక్కరోజు ముందునుంచే భక్తులకు గణపయ్య కనువిందు చేస్తున్నారు. ఈ ఏడాది 70 అడుగుల ఎత్తులో సప్తముఖశక్తి మహాగణపతిగా దర్శనమిస్తున్న గణేష్‌ను దర్శించుకునేందుకు భక్తులు బారులు తీరుతున్నారు. శనివారం సాయంత్రం 3 గంటల నుంచి గణపతి పూజలందుకోనున్నారు. 1954లో ఖైరతాబాద్ గణేషుడి ప్రస్థానం ప్రారంభమైంది. 70 అడుగుల ఎత్తులో పూర్తిగా పర్యావరణ హితమైన మట్టి గణపతిగా భక్తులకు కనువిందు చేస్తున్నారు. కాగా శనివారం ఉదయం 11 గంటలకు సీఎం రేవంత్ రెడ్డి కుటుంబ సమేతంగా తొలిపూజలో పాల్గొననున్నారు. సాయంత్రం 3 గంటలకు తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ప్రత్యేక పూజల్లో పాల్గొననున్నారు.
బందోబస్తుకు 3 షిఫ్టుల్లో 400 మంది పోలీసులు..
ఖైరతాబాద్ గణపతిని దర్శించుకునేందుకు ఈసారి భక్తులు అధిక సంఖ్యలో వచ్చే అవకాశాలు ఉండడం, శని, ఆదివారాలు రెండు సార్లు రావడంతో పోలీసులు భారీ బందోబస్తు చర్యలు చేపట్టారు. తొలిరోజునే రాష్ట్ర ముఖ్యమంత్రితో పాటు గవర్నర్‌లు పూజలకు రానుండడంతో 24 గంటల పాటు పోలీసులు 3 షిఫ్టుల్లో విధులు నిర్వహించేలా అధికారులు ఏర్పాట్లు చేశారు. భారీ గణపతి వద్ద బందోబస్తు కోసం ముగ్గురు డీఎస్‌పీలు, 13 మంది ఇన్‌స్పెక్టర్లు, 33 మంది ఎస్‌ఐలు, 22 ప్లాటూన్ల సిబ్బంది పనిచేస్తారని సైఫాబాద్ ఏసీపీ ఆర్ సంజయ్ కుమార్ తెలిపారు.
ట్రాఫిక్ ఆంక్షలు
- ఖైరతాబాద్ గణపతి దర్శనం కోసం వచ్చే భక్తులు సొంత వాహనాలను తీసుకురాకపోవడం మంచిది.
- రైల్వేగేటు గుండా నడచుకుంటూ వచ్చిన వారినే లోనికి అనుమతిస్తారు. ఈ మార్గంలో వాహనాలను అనుమతించబోరు.
- ఖైరతాబాద్ ఫ్లైఓవర్ గుండా వచ్చిన వారు వాహనాలను ఐమాక్స్ పక్కనున్న పార్కింగ్ స్థలంలో పార్కు చేసి నడుచుకుంటూ దర్శనానికి రావాలి.
- మింట్ కాంపౌండ్ వైపు వచ్చే భక్తులు వాహనాలను కారు రేసింగ్ ప్రాంతంలో పార్కు చేసి, నడచుకుంటూ దర్శనానికి రావాలి.
- రోడ్లపై వాహనాలను నిలిపితే సీజ్ చేస్తాం.
- గణపతికి మూడు వైపులా 500 మీటర్ల వరకు నో వెండింగ్ జోన్ ఉంది. చిరు వ్యాపారాలకు అనుమతి లేదు.
ఈ వార్తలు కూడా చదవండి..
సీఎం చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్..
చంద్రబాబుతో కళ్ళల్లో నీళ్లు చూశాను..
బుడమేరును మింగేసిన వైసీపీ నాయకులు..
సజ్జలను అరెస్టు చేస్తే.. అన్నీ బయటకొస్తాయి ..
టీడీపీ నేతలకు సీఎం స్ట్రాంగ్ వార్నింగ్..
Read Latest AP News and Telugu News
Read Latest Telangana News and National News
Read Latest Chitrajyothy News and Sports News
Updated Date - Sep 06 , 2024 | 01:49 PM