ఏపీలో హైడ్రా..: మంత్రి నారాయణ..
ABN, Publish Date - Sep 17 , 2024 | 01:43 PM
విజయవాడ: భవిష్యత్తులో వరదలవల్ల విజయవాడ మునిగిపోకుండా ఉండేలా ప్రభుత్వం పటిష్ట చర్యలు తీసుకుంటుందని మంత్రి నారాయణ తెలిపారు. తెలంగాణలో హైడ్రా తరహాలోనే ఆపరేషన్ బుడమేరు పేరిట ప్రత్యేక కార్యక్రమం వీలైనంత త్వరలో ప్రారంభిస్తామని మంత్రి స్పష్టం చేశారు.
విజయవాడ: భవిష్యత్తులో వరదలవల్ల విజయవాడ మునిగిపోకుండా ఉండేలా ప్రభుత్వం పటిష్ట చర్యలు తీసుకుంటుందని మంత్రి నారాయణ తెలిపారు. తెలంగాణలో హైడ్రా తరహాలోనే ఆపరేషన్ బుడమేరు పేరిట ప్రత్యేక కార్యక్రమం వీలైనంత త్వరలో ప్రారంభిస్తామని మంత్రి స్పష్టం చేశారు. వైసీపీ హయాంలో జలవనరులను ఆక్రమించి భారీగా చేపట్టిన నిర్మాణాలతో వరద నీరు నివాస ప్రాంతాలను ముంచెత్తుతుందని చెప్పారు.
ఆక్రమ నిర్మాణాలు తొలగింపుతోనే భవిష్యత్తులో విజయవాడ తరహా విపత్తులు ఏపీలో పునరావృతం కావని మంత్రి నారాయణ స్పష్టం చేశారు. ఈ విషయంలో రాజీ పడేది లేదని, సీఎం చంద్రబాబు నాయుడు స్పష్టంగా చెప్పారని అన్నారు. ఎంతటివారైనా.. ఏ పార్టీకి చెందినా.. ఎంత బలవంతులైనా ఉపేక్షించేది లేదని, చర్యలు తీసుకుంటామని, కొద్ది మంది వల్ల 7 లక్షల మంది బాధపడ్డారని అన్నారు. దీనికి సంబంధించి ఇరిగేషన్ అధికారులు ప్లాన్ సిద్ధం చేశాక.. మున్సిపల్ డిపార్టుమెంట్‌తో కో-ఆర్డినేషన్ చేసుకుని కార్యక్రమం ప్రారంభిస్తామని మంత్రి నారాయణ స్పష్టం చేశారు.
ఈ వార్తలు కూడా చదవండి..
ఖైరతాబాద్ గణేష్ శోభాయాత్ర.. (ఫోటో గ్యాలరీ)
తెలంగాణ ప్రజాపాలన దినోత్సవం (ఫోటో గ్యాలరీ)
సీఎం చంద్రబాబు రేపు కూటమి ఎమ్మెల్యేలతో ప్రత్యేక భేటీ..
చైనాను వణికిస్తున్న బెబింకా తుఫాను..
జానీ మాస్టర్ బాధితురాలి స్టేట్మెంట్‌లో సంచలన నిజాలు..
Read Latest AP News and Telugu News
Read Latest Telangana News and National News
Read Latest Chitrajyothy News and Sports News
Updated Date - Sep 17 , 2024 | 01:49 PM