ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

నందిగం కనుసన్నల్లోనే.. ‘బోట్ల’ కుట్ర

ABN, Publish Date - Sep 10 , 2024 | 09:33 AM

విజయవాడ: ప్రకాశం బ్యారేజీ కౌంటర్‌ వెయిట్లను ఢీ కొట్టిన ఇనుప బోట్ల వెనుక కుట్ర ఉన్నట్లు పోలీసులు తేల్చారు. మాజీ సీఎం జగన్‌ సన్నిహితుడు, వైసీపీ ఎమ్మెల్సీ తలశిల రఘురాం, మాజీ ఎంపీ నందిగం సురేశ్‌ కనుసన్నల్లోనే కార్గో బోట్లు నదిలోకి కదిలి వచ్చాయని దర్యాప్తు బృందాలు నిర్ధారణకు వచ్చాయి.

విజయవాడ: ప్రకాశం బ్యారేజీ కౌంటర్‌ వెయిట్లను ఢీ కొట్టిన ఇనుప బోట్ల వెనుక కుట్ర ఉన్నట్లు పోలీసులు తేల్చారు. మాజీ సీఎం జగన్‌ సన్నిహితుడు, వైసీపీ ఎమ్మెల్సీ తలశిల రఘురాం, మాజీ ఎంపీ నందిగం సురేశ్‌ కనుసన్నల్లోనే కార్గో బోట్లు నదిలోకి కదిలి వచ్చాయని దర్యాప్తు బృందాలు నిర్ధారణకు వచ్చాయి. మూడు కౌంటర్‌ వెయిట్ల ధ్వంసానికి కారణమైన ఇద్దరిని అరెస్టు చేశారు. వన్‌టౌన్‌ ఇన్‌స్పెక్టర్‌ గురుప్రకాశ్‌ ఆధ్వర్యంలో ఇబ్రహీంపట్నం మండలం సూరాయిపాలెం గ్రామానికి చెందిన కోమటి రామ్మోహన్‌, గొల్లపూడి గంగానమ్మ ఆలయం ప్రాంతానికి చెందిన వక్కలగడ్డ ఉషాద్రిని అరెస్టు చేసి ఇక్కడి చీఫ్‌ మెట్రోపాలిటన్‌ కోర్టులో హాజరుపరిచారు. న్యాయాధికారి రాజశేఖర్‌ వారికి ఈ నెల 20వ తేదీ వరకు రిమాండ్‌ విధించారు. అనంతరం వారిని విజయవాడలోని జిల్లా జైలుకు తరలించారు.


ప్రకాశం బ్యారేజీకి ఇటీవల 11.47 లక్షల క్యూసెక్కుల వరద వచ్చినప్పుడు ఐదు బోట్లు కొట్టుకుని వచ్చి కౌంటర్‌ వెయిట్లను ఢీ కొట్టిన విషయం తెలిసిందే. 67, 69 గేట్ల వద్ద ఉండే కౌంటర్‌ వెయిట్లు మధ్యకు విరిగిపోగా, 70వ నంబరు కౌంటర్‌ వెయిట్‌కు పగుళ్లు వచ్చాయి. ఈ మూడింటి స్థానంలో కొత్త స్టీల్‌ కౌంటర్‌ వెయిట్లను ఏర్పాటు చేయాల్సి వచ్చింది. 5 బోట్లలో ఒకటి ప్రవాహంలో కొట్టుకుపోగా.. మూడు మాత్రం కౌంటర్‌ వెయిట్లను ఢీకొని అక్కడే నిలిచిపోయాయి. ఇంకోటి గేటు కింద ఇరుక్కుపోయి ఉంటుందని భావిస్తున్నారు. బ్యారేజీకి కొట్టుకొచ్చిన బోట్ల బాగోతాన్ని పోలీసులు వెలికితీశారు.


ఈ వార్తలు కూడా చదవండి..

బుడమేరు సక్సెస్.. ఫలించిన కష్టం..

వారిని ఎందుకు అరెస్ట్‌ చేయలేకపోతున్నారు?

బీజేపీలో చేరే ప్లాన్‌లో మాఫియా డాన్‌..!

వరద సహాయక చర్యల్లో మంత్రి నారాయణ

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated Date - Sep 10 , 2024 | 09:33 AM

Advertising
Advertising