ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

హైడ్రా వెనుక రాజకీయం లేదు: రేవంత్ రెడ్డి

ABN, Publish Date - Sep 17 , 2024 | 01:07 PM

హైదరాబాద్: హైడ్రా పని తీరుపై వస్తున్న విమర్శలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందించారు. ఈ సందర్భంగా మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఒకప్పుడు లేట్ సిటీగా పేరుపొందిన హైదరాబాద్.. ఈరోజు ఫ్లడ్ సిటీగా దిగజారిపోవడానికి గత పదేళ్ల పాలకుల పాపమే కారణమని అన్నారు.

హైదరాబాద్: హైడ్రా పని తీరుపై వస్తున్న విమర్శలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందించారు. ఈ సందర్భంగా మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఒకప్పుడు లేట్ సిటీగా పేరుపొందిన హైదరాబాద్.. ఈరోజు ఫ్లడ్ సిటీగా దిగజారిపోవడానికి గత పదేళ్ల పాలకుల పాపమే కారణమని అన్నారు. వాటి ప్రక్షాళన కోసమే హైడ్రాను ఏర్పాటు చేశామని సీఎం స్పష్టం చేశారు. చెరువులు, నాళాలను కాపాడుకోలేకపోతే భవిష్యత్ తరాలు భారీ మూల్యం చెల్లించుకోవాల్సిన పరిస్థితి వస్తుందని అన్నారు. ఇటీవల కేరళలో ప్రకృతి విలయతాండం చూశామని.. వేలాది ప్రాణాలు ప్రకృతి ప్రకోపానికి బలైపోయాయన్నారు. ఆ పరిస్థితి హైదరాబాద్‌కు రాకూడదని.. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు.


హైడ్రా వేనుక రాజకీయ కోణం లేదని, స్వార్థం లేదని, అదొక ప్రవిత్ర కార్యమని, ప్రకృతిని కాపాడుకునే యజ్ఞమని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. దీనికి ప్రతి ఒక్కరూ సహకరించాలని ముఖ్యమంత్రి కోరారు. కొందరు భూ మాఫియా వాళ్లు.. పేదలను ముందు పెట్టి హైడ్రా లక్ష్యాన్ని నీరుగార్చే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. ఎన్ని అడ్డంకులు వచ్చినా హైడ్రా ఆగదని, హైదరాబాద్ భవిష్యత్తుకు హైడ్రా గ్యారంటీ ఇస్తుందని.. ఇది తన భరోసా అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. దీనికి ప్రజలు సహకరించాల్సిందిగా మరొక్కసారి కోరుతున్నారని అన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

ఖైరతాబాద్ గణేష్ శోభాయాత్ర.. (ఫోటో గ్యాలరీ)

తెలంగాణ ప్రజాపాలన దినోత్సవం (ఫోటో గ్యాలరీ)

సీఎం చంద్రబాబు రేపు కూటమి ఎమ్మెల్యేలతో ప్రత్యేక భేటీ..

చైనాను వణికిస్తున్న బెబింకా తుఫాను..

జానీ మాస్టర్ బాధితురాలి స్టేట్మెంట్‌లో సంచలన నిజాలు..

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated Date - Sep 17 , 2024 | 01:08 PM

Advertising
Advertising