ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

రాజ్‌భవన్‌లో ఘనంగా ఉగాది వేడుకలు

ABN, Publish Date - Apr 09 , 2024 | 08:12 PM

తెలుగు ప్రజలకు తెలంగాణ గవర్నర్ సీపీ రాధాకృష్ణన్ క్రోధి నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. మంగళవారం తెలంగాణ రాజ్‌భవన్‌లో ఘనంగా ఉగాది వేడుకలు జరిగాయి. ఈ సందర్బంగా గవర్నర్ రాధాకృష్ణన్ మాట్లాడుతూ.. ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలన్నారు. రాష్ట్రాభివృద్ధిలో మరింత దూకుడుగా వెళ్ళాలని ఆకాంక్షిస్తున్నట్లు ఆయన తెలిపారు.

cp radhakrishnan

హైదరాబాద్, ఏప్రిల్ 09: తెలుగు ప్రజలకు తెలంగాణ గవర్నర్ సీపీ రాధాకృష్ణన్ క్రోధి నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. మంగళవారం తెలంగాణ రాజ్‌భవన్‌లో ఘనంగా ఉగాది వేడుకలు జరిగాయి. ఈ సందర్బంగా గవర్నర్ రాధాకృష్ణన్ మాట్లాడుతూ.. ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలన్నారు.

Bhadrachalam: నేటి నుంచి భద్రాచలంలో శ్రీరామనవమి బ్రహ్మోత్సవాలు షురూ

రాష్ట్రాభివృద్ధిలో మరింత దూకుడుగా వెళ్ళాలని ఆకాంక్షిస్తున్నట్లు ఆయన తెలిపారు. మన దేశం అన్ని రంగాల్లో స్వదేశీ ఉత్పత్తులతో ముందుకు వెళ్తోందన్నారు. జోతిష్య అంచనాలు ఏమున్నా.... దృడ సంకల్పంతో ముందుకు వెళ్లాలని పేర్కొన్నారు. ఎన్ని కష్టాలు వచ్చినా ఉగాది పచ్చడి వలేనే అన్నింటినీ కలుపుకొని వెళ్లాలని ఆయన ప్రజలకు సూచించారు. అయితే పోరాట ప్రయత్నాలు మాత్రం ఆపవద్దన్నారు. వర్షాలు సమృద్ధిగా కూరిసి.. తెలంగాణ రాష్ట్రం పాడి పంటలతో కళకళలాడాలని చెప్పారు.

పార్టీ పంచాంగం చెప్పిన జగ్గారెడ్డి


మే 13వ తేదీన ప్రతీ ఓటరు... తన ఓటు హక్కు వినియోగించుకోవాలని ఓటర్లకు ఈ సందర్భంగా గవర్నర్ సూచించారు. అయితే ఇది తన తొలి తెలుగు ప్రసంగమన్నారు. తెలుగు అనేది గ్రేట్ కల్చర్‌ అని ఆయన అభివర్ణించారు. ప్రపంచంలో అద్భుతమైన కీర్తనలు తెలుగులో ఉన్నాయని ఈ సందర్భంగా గవర్నర్ సీపీ రాధాకృష్ణన్ గుర్తు చేశారు.

Hyderabad: మెట్రో ఆఫర్లు.. మరో ఆరు నెలలు పొడిగింపు

రాజ్‌భవన్‌లో జరిగిన ఉగాది వేడుకల్లో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతకుమారి, తెలంగాణ డీజీపీ రవిగుప్తాతోపాటు పలువురు ఐఏఎస్, ఐపీఎస్‌లు పాల్గొన్నారు.

తెలంగాణ వార్తలు కోసం..

Updated Date - Apr 09 , 2024 | 08:12 PM

Advertising
Advertising