Share News

Bhadrachalam: నేటి నుంచి భద్రాచలంలో శ్రీరామనవమి బ్రహ్మోత్సవాలు షురూ

ABN , Publish Date - Apr 09 , 2024 | 08:21 AM

తెలంగాణ భద్రాచలం(Bhadrachalam) జిల్లాలోని శ్రీసీతారామచంద్ర స్వామి దేవస్థానం(Sri Seetha Ramachandra Swamy Devasthanam)లో శ్రీరామ నవమి తిరుకళ్యాణ బ్రహ్మోత్సవాలు(Sri Rama Navami Brahmotsavam celebrations) నేటి( ఏప్రిల్ 9) నుంచి ప్రారంభమయ్యాయి. ఉగాది పండుగ క్రోది నామ సంవత్సరం పురస్కరించుకుని బ్రహ్మోత్సవాలకు నేడు అంకురార్పణ చేశారు.

Bhadrachalam: నేటి నుంచి భద్రాచలంలో శ్రీరామనవమి బ్రహ్మోత్సవాలు షురూ

తెలంగాణ భద్రాచలం(Bhadrachalam) జిల్లాలోని శ్రీసీతారామచంద్ర స్వామి దేవస్థానం(Sri Seetha Ramachandra Swamy Devasthanam)లో శ్రీరామ నవమి తిరుకళ్యాణ బ్రహ్మోత్సవాలు(Sri Rama Navami Brahmotsavam celebrations) నేటి( ఏప్రిల్ 9) నుంచి ప్రారంభమయ్యాయి. ఉగాది పండుగ క్రోధి నామ సంవత్సరం పురస్కరించుకుని బ్రహ్మోత్సవాలకు నేడు అంకురార్పణ చేశారు. ఇవి నేటి నుంచి ఈనెల 23 వరకు జరుగనున్నాయి. దీంతో ఆలయ పరిసరాలు మొత్తం భక్తుల(Devotees) రాకతో సందడిగా మారాయి. ఈ వేడుకల్లో భాగంగా శ్రీరాముని పట్టాభిషేకం వేడుకలు జరగనున్నాయి. టిక్కెట్లు ఆన్‌లైన్‌, టికెట్ కౌంటర్లలో కూడా అందుబాటులో ఉన్నాయి.


శ్రీరామ నవమి బ్రహ్మోత్సవాలు(Sri Rama Navami Brahmotsavam) ప్రతి ఏటా చైత్ర మాసంలో నిర్వహిస్తారు. బ్రహ్మోత్సవాలలో అత్యంత పవిత్రమైన రోజు శ్రీరామ నవమి. ఈ పవిత్రమైన రోజున శ్రీసీతారామ కల్యాణం వైభవంగా నిర్వహిస్తారు.

బ్రహ్మోత్సవం షెడ్యూల్ 2024:

ఏప్రిల్ 09 - ఉగాది, తిరువీడి సేవ

ఏప్రిల్ 13 - అంకురార్పణం

ఏప్రిల్ 14 - గరుడ పథ లేకనం

ఏప్రిల్ 15 - అగ్ని ప్రతిష్ట, ద్వజారోహణం

ఏప్రిల్ 16 - చతుఃస్థానార్చన, ఎదురుకోలు

ఏప్రిల్ 17 - శ్రీరామ నవమి కల్యాణం (ఉదయం 10.30 - మధ్యాహ్నం 12.30)

ఏప్రిల్ 18 - మహా పట్టాభిషేకం

ఏప్రిల్ 19 - సదస్యం, హంస వాహన సేవ

ఏప్రిల్ 20 - తెప్పోత్సవం, చోరోత్సవం, అశ్వ వాహన సేవ

ఏప్రిల్ 21 - ఊంజల్ ఉస్తవం, సింహ వాహన సేవ

ఏప్రిల్ 22 - వసంతోత్సవం, హవనం, గజ వాహన సేవ

ఏప్రిల్ 23 - చక్రతీర్థం, పూర్ణాహుతి


ఇది కూడా చదవండి:

మేడిగడ్డ మరింత కుంగింది!


అప్రూవర్లుగా ఇద్దరు!


మరిన్ని తెలంగాణ వార్తల కోసం

Updated Date - Apr 09 , 2024 | 09:14 AM