ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

TGPSC: యూపీఎస్సీ చైర్‌పర్సన్‌తో టీజీపీఎస్సీ చైర్మన్‌ బుర్రా భేటీ

ABN, Publish Date - Dec 19 , 2024 | 03:45 AM

జాతీయ స్థాయి ఉద్యోగ నియామకాల్లో అమలవుతున్న విధానాలపై తెలంగాణ రాష్ట్ర పబ్లిక్‌ సర్వీసు కమిషన్‌(టీజీపీఎస్సీ) అధికారులు అధ్యయనం ప్రారంభించారు.

హైదరాబాద్‌, డిసెంబరు 18 (ఆంధ్రజ్యోతి): జాతీయ స్థాయి ఉద్యోగ నియామకాల్లో అమలవుతున్న విధానాలపై తెలంగాణ రాష్ట్ర పబ్లిక్‌ సర్వీసు కమిషన్‌(టీజీపీఎస్సీ) అధికారులు అధ్యయనం ప్రారంభించారు. బుధవారం ఢిల్లీలో టీఎ్‌సపీఎస్సీ చైర్మన్‌ బుర్రా వెంకటేశం, ఐదుగురు కమిషన్‌ సభ్యులతో కలిసి యూనియన్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌(యూపీఎస్సీ)ను సందర్శించారు. ఈ సందర్భంగా యూపీఎస్సీ చైర్‌పర్సన్‌ ప్రీతి సుడాన్‌తో విస్తృత చర్చలు జరిపారు. యూపీఎస్సీలో అమలవుతున్న విధానాలు, విధులకు సంబంఽధించిన ప్రదర్శనను(ప్రజంటేషన్‌) ఈ బృందం తిలకించింది.


కమిషన్‌కు నిధులను సమకూర్చడంతో పాటు, నియామకాల్లో ఐటీని ఉపయోగించుకునే అంశంపై చర్చించారు. నియామకాల్లో భాగంగా నిర్వహించే పరీక్షలను మరింత సమర్థంగా ఎలా జరపాలి? పారదర్శకతను పెంచడానికి తీసుకోవాల్సిన చర్యలపైనా చర్చించారు. కాగా ఈ ఏడాది కాలంలో టీఎ్‌సపీఎస్సీ ఆధ్వర్యంలో 13 వేల పోస్టులను భర్తీ చేసినట్టు చైర్మన్‌ ఈ సందర్భంగా వెల్లడించారు.

Updated Date - Dec 19 , 2024 | 03:45 AM