ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Indiramma Housing: 15 రోజుల్లో సర్వే పూర్తి.. ఇల్లు మంజూరు!

ABN, Publish Date - Dec 16 , 2024 | 03:23 AM

ఏదైనా గ్రామంలో 500 కంటే తక్కువ దరఖాస్తులు ఉంటే.. 15 రోజుల్లోనే సర్వే పూర్తి చేయాలని, అర్హులుగా గుర్తించిన వారికి వెంటనే ఇల్లు మంజూరు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.

  • 500లోపు దరఖాస్తులున్న గ్రామాల్లో అమలు

  • పరిశీలన త్వరితగతిన పూర్తయ్యేలా ప్రణాళిక

  • నెట్‌ సమస్య ఉన్న చోట్ల ఆఫ్‌లైన్‌లో సర్వే

  • ఆ తర్వాత యాప్‌లో నమోదుకు చర్యలు

  • అన్ని జిల్లాల కలెక్టర్లకు సర్కారు సూచనలు

  • లబ్ధిదారుల కోసం గ్రీవెన్స్‌ సెల్‌, టోల్‌ ఫ్రీ

హైదరాబాద్‌, డిసెంబరు 15 (ఆంధ్రజ్యోతి): ఏదైనా గ్రామంలో 500 కంటే తక్కువ దరఖాస్తులు ఉంటే.. 15 రోజుల్లోనే సర్వే పూర్తి చేయాలని, అర్హులుగా గుర్తించిన వారికి వెంటనే ఇల్లు మంజూరు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇతర ప్రాంతాల్లో నిర్వహిస్తున్న సర్వేతో సంబధం లేకుండా సర్వే పూర్తయిన గ్రామాల్లో లబ్ధిదారులకు ఇళ్లను మంజూరు చేయాలని కలెక్టర్లకు సూచించింది. వాస్తవానికి గత ఏడాది డిసెంబరులో ప్రభుత్వం నిర్వహించిన ప్రజాపాలన కార్యక్రమంలో ఇందిరమ్మ ఇళ్ల పథకం కోసం రాష్ట్ర వ్యాప్తంగా 80.54లక్షల దరఖాస్తులు వచ్చిన విషయం తెలిసిందే. మొదటి దశలో సొంతస్థలం ఉన్న వారికి రూ.5లక్షలు ఇవ్వనుండగా.. రెండో దశలో స్థలం లేని వారికి స్థలమిచ్చి, రూ.5లక్షల ఆర్థిక సాయాన్ని అందించేలా పథకాన్ని రూపొందించారు. ఈ ఏడాది రాష్ట్ర వ్యాప్తంగా 4.50లక్షల ఇళ్లను మంజూరు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగానే ప్రస్తుతం గ్రామాల్లో దరఖాస్తుల పరిశీలన(సర్వే) కొనసాగుతోంది. అయితే, ఇందిరమ్మ ఇళ్ల పథకం అమలులో ఎలా వ్యవహరించాలి? లబ్ధిదారుల గుర్తింపు నుంచి ఇంటి మంజూరు వరకు తీసుకోవాల్సిన చర్యలేంటి? అన్న అంశాలపై అన్ని జిల్లాల కలెక్టర్లకు ప్రభుత్వం పలు సూచనలు చేసింది. పెద్ద గ్రామ పంచాయతీలు, మండల కేంద్రాల్లో దరఖాస్తులు ఎక్కువగా ఉంటే.. మొబైల్‌ యాప్‌లో అదనంగా మరొక లాగిన్‌ను ఇచ్చేందుకు అవకాశం కల్పించాలని ఆదేశించింది. తద్వారా దరఖాస్తుల పరిశీలన ప్రక్రియ త్వరితగతిన పూర్తయ్యేందుకు అవకాశం ఉంటుందని పేర్కొంది.


ఆఫ్‌లైన్‌లోనూ వివరాల సేకరణ

ప్రస్తుతం గ్రామాల్లో దరఖాస్తుల పరిశీలనను మొబైల్‌ యాప్‌లో ఆన్‌లైన్‌ విధానం ద్వారా నిర్వహిస్తున్నారు. దరఖాస్తుదారుల వద్దకు అధికారులు వెళ్లి ఫొటోలు తీసుకుంటున్నారు. సొంతస్థలం ఉన్న వారిని అదే స్థలం దగ్గర ఉంచి ఫొటో తీస్తుండగా, స్థలం లేని వారి వివరాలను కూడా యాప్‌లో పొందుపరుస్తున్నారు. అయితే, ఈ ప్రక్రియలో మారుమూల గ్రామాలు, గిరిజన తండాలు, ఆదివాసీ ఆవాసాలు ఉన్నచోట ఇంటర్‌నెట్‌ లేకపోవడం సమస్యగా మారింది. ఈ విషయాన్ని పరిగణనలోకి తీసుకున్న ప్రభుత్వం యాప్‌లో ఆఫ్‌లైన్‌ విధానాన్ని అమలు చేయాలని నిర్ణయించిది. ఈ మేరకు ఇంటర్‌నెట్‌ సమస్య ఉన్న ప్రాంతాల్లో మొద ట దర ఖాస్తుదారుల వివరాలను సేకరిస్తారు. అనంతరం ఆ వివరాలను అధికారులు మొబైల్‌ యాప్‌లో పొందుపర్చే వెసులుబాటు కల్పించింది. ఆన్‌లైన్‌లో నమోదు చేసే దరఖాస్తుదారు, వారి స్థలం వివరాలన్నింటినీ జియో ట్యాగింగ్‌ చేయాలని ఆదేశించింది.


పీఏంఏవైతో అనుసంధానం

ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని కేంద్రం అమలుచేసే ప్రధానమంత్రి ఆవాస యోజన(పీఎంఏవై)తో అనుసంధానించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నేపథ్యంలో దరఖాస్తుల వివరాలన్నింటినీ కేంద్రం సూచించే యాప్‌లోనూ పొందుపర్చాలని, ఇందుకోసం అదనంగా అవసరమైన ఫొటోలను కూడా ముందుగానే తీసుకోవాలని అధికారులకు సూచించింది. సర్వేతోపాటు పథకం అమలును మండల స్థాయిలో ఉన్న అధికారి పర్యవేక్షించనుండగా.. ప్రతి నలుగురు సర్వేయర్లకు ప్రత్యేక అధికారిని నియమించింది. కాగా. దరఖాస్తుదారులు లేదా లబ్ధిదారుల అనుమానాలు నివృత్తి చేసేందుకు గ్రీవెన్స్‌ సెల్‌తోపాటు టోల్‌ఫ్రీ నంబర్‌ ఏర్పాటు చేయాలని సర్కారు భావిస్తోంది.

Updated Date - Dec 16 , 2024 | 03:23 AM