ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

University: 9 వర్సిటీలకు ఉప కులపతులు

ABN, Publish Date - Oct 19 , 2024 | 03:52 AM

రాష్ట్రంలోని తొమ్మిది విశ్వవిద్యాలయాలకు ఉప కులపతులను ప్రభుత్వం నియమించింది. ఉస్మానియా విశ్వవిద్యాలయానికి ఆచార్య కుమార్‌ మొలుగారం, కాకతీయకు ఆచార్య ప్రతాప్‌ రెడ్డి, పాలమూరు విశ్వవిద్యాలయానికి

  • ఓయూకు ఆచార్య కుమార్‌ మొలుగారం..

  • కాకతీయకు ఆచార్య ప్రతాప్‌ రెడ్డి

  • వ్యవసాయ వర్సిటీకి అల్దాస్‌ జానయ్య

  • తెలుగు వర్సిటీకి నిత్యానందరావు..

  • ‘తెలంగాణ’కు యాదగిరిరావు

హైదరాబాద్‌, అక్టోబరు 18 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోని తొమ్మిది విశ్వవిద్యాలయాలకు ఉప కులపతులను ప్రభుత్వం నియమించింది. ఉస్మానియా విశ్వవిద్యాలయానికి ఆచార్య కుమార్‌ మొలుగారం, కాకతీయకు ఆచార్య ప్రతాప్‌ రెడ్డి, పాలమూరు విశ్వవిద్యాలయానికి ఆచార్య జీఎన్‌ శ్రీనివాస్‌, శాతవాహనకు ఆచార్య ఉమేశ్‌ కుమార్‌, తెలుగు విశ్వవిద్యాలయానికి ఆచార్య నిత్యానంద రావు, మహాత్మాగాంధీ విశ్వవిద్యాలయానికి ఆచార్య అల్తాఫ్‌ హుస్సేన్‌, తెలంగాణ విశ్వవిద్యాలయానికి ఆచార్య యాదగిరి రావు, ఆచార్య జయశంకర్‌ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయానికి ఆచార్య అల్దాస్‌ జానయ్య, శ్రీ కొండా లక్ష్మణ్‌ తెలంగాణ ఉద్యాన విశ్వవిద్యాలయానికి ఆచార్య రాజిరెడ్డి వీసీలుగా నియమితులయ్యారు. ఈ మేరకు రాష్ట్ర గవర్నర్‌, విశ్వవిద్యాలయాల కులపతి జిష్ణుదేవ్‌ వర్మ నిర్ణయం అనంతరం రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీచేసింది.


గత ఉప కులపతుల పదవీకాలం గత మే నెల 21న పూర్తయ్యాక.. తాత్కాలిక వీసీలుగా సీనియర్‌ ఐఏఎస్‌ అధికారులను నియమించిన ప్రభుత్వం కొత్త వీసీల నియమకానికి ప్రతి వర్సిటీకి ముగ్గురు సభ్యులతో సర్చ్‌ కమిటీ నియమించింది. మొత్తం పది వర్సిటీలకు 1382 దరఖాస్తులు వచ్చాయి. కమిటీ సిఫారసుల మేరకు జాబితా సిద్ధం చేసిన ప్రభుత్వం గవర్నర్‌ తుది ఆమోదానికి పంపింది. అయితే మరో నాలుగు వర్సిటీల ఉప కులపతులను నియమించాల్సి ఉంది. ఇందులో జవహర్‌లాల్‌ నెహ్రూ టెక్నాలజీ యూనివర్సిటీ (జేన్‌టీయూ), బీఆర్‌ అంబేడ్కర్‌ దూరవిద్య విశ్వవిద్యాలయం, జవహర్‌లాల్‌ నెహ్రూ ఆర్కిటెక్చర్‌ ఫైన్‌ ఆర్ట్‌ విశ్వవిద్యాలయం(జేఎన్‌ఏఎ్‌ఫఏయూ), పీవీ నరసింహారావు పశువైద్య విశ్వవిద్యాలయం ఉన్నాయి. ఈ నాలుగు వర్సిటీల వీసీల నియామకం త్వరలో పూర్తవుతుందని అధికార వర్గాలు తెలిపాయి.


  • ఓయూ వీసీగా తొలిసారి దళిత వ్యక్తి

దళిత వ్యక్తికి ఓయూ వైస్‌చాన్స్‌లర్‌గా తొలిసారి అవకాశం లభించింది. వీసీగా నియమితులైన ఆచార్య కుమార్‌ మొలుగారం దళిత సామాజిక వర్గానికి చెందిన వారు. ఓయూ ఇంజనీరింగ్‌ కాలేజీలో సీనియర్‌ ప్రొఫెసర్‌గా, రీజనల్‌ సెంటర్‌ ఫర్‌ అర్బన్‌ అండ్‌ ఎన్విరాన్‌మెంట్‌ డైరెక్టర్‌గా ఆయన పనిచేశారు. ఉస్మానియా నుంచే డిగ్రీ పూర్తిచేశారు. జేఎన్‌యూలో మాస్టర్స్‌ చేశారు. ఐఐటీ బాంబే నుంచి డాక్టరేట్‌ అందుకున్నారు. రంగారెడ్డి జిల్లా ఘట్కేసర్‌ మండలం కొండాపూర్‌కు చెందిన మోగ్లారామ్‌ 29ఏళ్లుగా బోధన, పరిశోధనాంశాల్లో సేవలందిస్తున్నారు.


తెలంగాణ ఉద్యాన విశ్వద్యాలయానికి వీసీగా నియమితులైన రాజిరెడ్డి పెద్దపల్లి జిల్లా వాస్తవ్యులు. 1992లో గుజరాత్‌ అగ్రికల్చర్‌ యూనివర్సిటీలో పీహెచ్‌డీ చేశారు. ప్రొఫెసర్‌ జయశంకర్‌ తెలంగాణ విశ్వవిద్యాలయ వీసీగా నియమితులైన డాక్టర్‌ జానయ్య స్వస్థలం నల్లగొండ జిల్లాలోని మామిడాల గ్రామం. బెనారెస్‌ హిందూ విశ్వవిద్యాలయంలో పీహెచ్‌డీ పూర్తిచేశారు. పదహారేళ్లపాటు ఇండియన్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ అగ్రికల్చర్‌ రీసెర్చ్‌లో సీనియర్‌ ఎకనమి్‌స్టగా చేశారు. తెలుగు విశ్వవిద్యాలయం వీసీగా నియమితులైన నిత్యానందరావు స్వస్థలం నాగర్‌కర్నూల్‌ జిల్లా మంగనూరు. ఓయూలో ఎంఏ తెలుగు, ఎంఫిల్‌, పీహెచ్‌డీ చేశారు.

Updated Date - Oct 19 , 2024 | 03:52 AM