DG Nagireddy: అగ్నిప్రమాదాల నివారణకు అత్యాధునిక సాంకేతికత
ABN, Publish Date - Dec 31 , 2024 | 05:17 AM
అగ్ని ప్రమాదాల నివారణకు, ప్రమాదాల సమయంలో నష్టాన్ని సాధ్యమైనంత తగ్గించేందుకు అత్యాధునిక సాంకేతిక పరికరాలను సమకూర్చుకోబోతున్నట్లు రాష్ట్ర అగ్నిమాపక విభాగం డీజీ నాగిరెడ్డి తెలిపారు.
త్వరలోనే పూర్తిస్థాయిలో సిబ్బంది.. పరికరాల కొనుగోలు
2024లో సహాయం కోసం అగ్నిమాపక శాఖకు 7,383 కాల్స్
2023తో పోలిస్తే రాష్ట్రంలో స్వల్పంగా తగ్గిన అగ్ని ప్రమాదాలు
తెలంగాణ రాష్ట్ర అగ్నిమాపక విభాగం డీజీ నాగిరెడ్డి
2024కు సంబంధించి అగ్నిమాపకశాఖ నివేదిక విడుదల
హైదరాబాద్/రాయదుర్గం, డిసెంబరు 30 (ఆంధ్రజ్యోతి): అగ్ని ప్రమాదాల నివారణకు, ప్రమాదాల సమయంలో నష్టాన్ని సాధ్యమైనంత తగ్గించేందుకు అత్యాధునిక సాంకేతిక పరికరాలను సమకూర్చుకోబోతున్నట్లు రాష్ట్ర అగ్నిమాపక విభాగం డీజీ నాగిరెడ్డి తెలిపారు. 2024 సంవత్సరంలో అగ్నిమాపక శాఖ నిర్వహించిన కార్యక్రమాలు, విజయాలపై వార్షిక నివేదికను విడుదల చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ప్రస్తుత రాష్ట్ర అవసరాలకు అనుగుణంగా తెలంగాణ ఫైర్ సర్వీస్ యాక్ట్-1999ను సవరించేందుకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించామన్నారు. 2023తో పోలిస్తే ఈ సంవత్సరం అగ్నిప్రమాదాల సంఖ్యలో 0.23ు తగ్గుదల నమోదైందన్నారు. సికింద్రాబాద్ స్వప్నలోక్ కాంప్లెక్స్, నాంపల్లి బజార్‌ఘాట్‌లో జరిగిన అగ్నిప్రమాదాల్లో భారీగా ప్రాణ, ఆస్తి నష్టం జరిగిందని నాగిరెడ్డి వెల్లడించారు. కాగా, ఈ ఏడాదిలో వేర్వేరు ప్రమాదాల్లో 435 మృతదేహాలను వెలికితీశామని నాగిరెడ్డి చెప్పారు.
1,360 మందికి శిక్షణ
అగ్నిమాపక శిక్షణా కేంద్రంలో ఈ ఏడాది మొత్తం 1,360 మందికి శిక్షణ అందించామని నాగిరెడ్డి వెల్లడించారు. అగ్నిమాపక శాఖ నుంచి అనుమతులకు సంబంధించిన దరఖాస్తులను గరిష్టంగా 15 రోజుల్లో పరిష్కరిస్తున్నామన్నారు. ఈ ఏడాదిలో 7,383 ఫైర్ కాల్స్‌కు హాజరైనట్లు వెల్లడించారు. గత సంవత్సరంతో పోలిస్తే ఫైర్ కాల్స్ 5.9ు పెరిగాయన్నారు. ఖమ్మంలో వరదల్లో రాత్రి సమయాల్లోనూ రెస్క్యూ ఆపరేషన్ నిర్వహించి 880 మందిని కాపాడామని తెలిపారు. రాష్ట్రంలో కొత్తగా స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్(ఎ్‌సడీఆర్‌ఎఫ్) ఏర్పాటు చేశామన్నారు. వ్యాపార సముదాయాలతో పాటు బహుళ అంతస్తుల భవనాల నుంచి అగ్నిమాపక శాఖకు పన్ను రూపంలో ప్రస్తుతం చదరపు మీటరుకు ఒక్క రూపాయి చెల్లిస్తున్నారని నాగిరెడ్డి తెలిపారు. ఫైర్ ేసఫ్టీ అవసరాలకు తగ్గట్లుగా పన్నును పెంచుతామని చెప్పారు. మరింత మెరుగైన సేవలు అందించేందుకు తగిన యంత్రపరికరాలను, రెస్క్యూ పరికరాలు సమకూర్చుకునేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చిందని చెప్పారు.
Updated Date - Dec 31 , 2024 | 05:17 AM