రిలయన్స్ ఉపకార వేతనాలకు 25 శాతం మంది తెలుగోళ్లు ఎంపిక
ABN, Publish Date - Dec 29 , 2024 | 05:21 AM
ఈ విద్యా సంవత్సరంలో అండర్ గ్రాడ్యుయేట్ కోర్సులు అభ్యసిస్తున్న విద్యార్థులకు చేయూత నందించడానికి ధీరూభాయి అంబానీ 92వ జయంతి సందర్భంగా రిలయన్స్ ఫౌండేషన్ ఉపకారవేతనాలు అందిస్తోంది.
హైదరాబాద్, డిసెంబరు 28 (ఆంధ్రజ్యోతి): ఈ విద్యా సంవత్సరంలో అండర్ గ్రాడ్యుయేట్ కోర్సులు అభ్యసిస్తున్న విద్యార్థులకు చేయూత నందించడానికి ధీరూభాయి అంబానీ 92వ జయంతి సందర్భంగా రిలయన్స్ ఫౌండేషన్ ఉపకారవేతనాలు అందిస్తోంది. వచ్చే పదేళ్లలో 50 వేలమందికి పైగా విద్యార్థులకు ఉపకార వేతనాలు అందించాలని 2022 లో సంస్థ నిర్ణయించింది. దీని కింద ట్యూషన్ ఫీజుతో పాటు వసతి, చదువు కోసం రూ.2 లక్షలదాకా ఆర్థికసాయం అందించనుంది. శనివా రం విడుదల చేసిన ఫలితాల్లో 5 వేలమందికిగాను 850మంది ఏపీ, 411 మంది తెలంగాణకు చెందినవారు, రెండు రాష్ట్రాల నుంచి మొత్తం 1,261 మంది విద్యార్థులు ఉపకారవేతనాలకు ఎంపికయ్యారని తెలిపింది. ఫలితాల కోసం జ్ట్టిఞ://ట్ఛజూజ్చీుఽఛ్ఛిజౌఠుఽఛ్చ్టీజీౌుఽ.ౌటజ/ఠజటఛిజిౌజ్చూటటజిజీఞట 202425 ట్ఛటఠజ్టూట అనే వెబ్‌సైట్‌ను పరిశీలించాలని సంస్థ కోరింది.
Updated Date - Dec 29 , 2024 | 05:21 AM