Sujana Chowdary: నా ఆస్తిని సుజనా చౌదరి తాకట్టు పెట్టారు
ABN, Publish Date - Dec 31 , 2024 | 03:55 AM
రూ.400కోట్ల విలువైన తన ఆస్తిని తాకట్టు పెట్టి ప్రస్తుత ఏపీ ఎమ్మెల్యే, సుజనా యూనివర్సల్ ఇండస్ర్టీస్ చైర్మన్ సుజనా చౌదరి రుణాలు పొందారని,
దర్యాప్తును వేగవంతం చేసేలా పోలీసులను ఆదేశించాలని హైకోర్టులో ఓ వ్యక్తి పిటిషన్
హైదరాబాద్, డిసెంబరు 30 (ఆంధ్రజ్యోతి) : రూ.400కోట్ల విలువైన తన ఆస్తిని తాకట్టు పెట్టి ప్రస్తుత ఏపీ ఎమ్మెల్యే, సుజనా యూనివర్సల్ ఇండస్ర్టీస్ చైర్మన్ సుజనా చౌదరి రుణాలు పొందారని, ఆ రుణాలు చెల్లించకపోవడంతో తన ఆస్తిని వేలానికి పెడుతున్నారంటూ హైదరాబాద్ బంజారాహిల్స్‌కు చెందిన హబీబ్ అల్లాడిన్ అనే వ్యక్తి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అమీర్‌పేట్ మండలం, బహ్లూఖాన్‌గూడ టౌన్ సర్వే నంబర్ 17లో 26,432 గజాల తన ఆస్తిని తాకట్టు పెట్టారని ఆరోపించారు.
ఈ వ్యవహారంపై ఫిబ్రవరిలో పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని.. విచారణ వేగవంతం చేసేలా ఆదేశాలు జారీ చేయాలని కోరారు. దీనిపై వాదనలు విన్న జస్టిస్ విజయ్‌సేన్‌రెడ్డి ధర్మాసనం.. ఈ వ్యవహారంపై పోలీసుల వైఖరి ఏంటో తెలియజేయాలని ఆదేశాలు జారీచేసింది.
Updated Date - Dec 31 , 2024 | 03:55 AM