ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

40 సంవత్సరాల నమ్మకం నిలుపుకుంటూ రమణీయమైన వివాహ వేడుకలు మీ ఇంట వెలిగేలా చేస్తున్న కాకతీయ మ్యారేజస్ తో మీ పేరు ఈరోజే నమోదు చేసుకోండి! ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Bandi Sanjay: పొన్నం ప్రభాకర్‌కు బండి సంజయ్ కౌంటర్

ABN, Publish Date - Jan 18 , 2024 | 11:45 AM

కరీంనగర్: పొన్నం ప్రభాకర్‌కు బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ కౌంటర్ ఇచ్చారు. అయోధ్య అక్షింతలను రేషన్ బియ్యం అనడం మంచి పద్దతి కాదని, అక్షింతలు అంటే ఎమిటో మీ కుటుంబ సభ్యులను అడగాలని, వాటి ప్రాముఖ్యత గురించి తెలియకుండా మాట్లాడవద్దన్నారు.

కరీంనగర్: పొన్నం ప్రభాకర్‌కు బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ కౌంటర్ ఇచ్చారు. అయోధ్య అక్షింతలను రేషన్ బియ్యం అనడం మంచి పద్దతి కాదని, అక్షింతలు అంటే ఏమిటో కుటుంబ సభ్యులను అడిగి తెలుసుకోవాలన్నారు. అక్షింతల ప్రాముఖ్యత గురించి తెలియకుండా మాట్లాడవద్దని సూచించారు. రామ మందిర ప్రాణప్రతిష్ఠ కార్యక్రమాన్ని రాజకీయం చేయొద్దని కోరారు.

గురువారం కరీంనగర్‌లో బండి సంజయ్ మీడియాతో మాట్లాడారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువుల చిరకాల వాంఛ ఈ నెల 22వ తేదీన నెరవేరబోతోందని హర్షం వ్యక్తం చేశారు. హిందూ బంధువుల సహకారంతో దివ్యమైన, భవ్యమైన రామాలయ నిర్మాణం పూర్తయిందన్నారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ పిలుపు మేరకు దేశంలోని ఆలయాలను శుద్ధి చేస్తున్నామని, అక్షింతల కార్యక్రమానికి ప్రజల నుంచి అపూర్వ స్పందన వచ్చిందని చెప్పారు. అక్షింతలు, రేషన్ బియ్యం అనే వారికి వాటి ప్రాముఖ్యత, పవిత్రత తెలియదన్నారు. అక్షింతల గురించి కామెంట్లు చేస్తే వారి ఇంట్లో వాళ్లు అక్షింతలు వేస్తారని బండి సంజయ్ వ్యంగ్యాస్త్రాలు సంధించారు.

Updated Date - Jan 18 , 2024 | 12:06 PM

Advertising
Advertising