ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Lok Sabha Polls 2024: తల్లి కోడి పిల్లలను కాపాడినట్టు తెలంగాణను కాపాడా: కేసీఆర్

ABN, Publish Date - Apr 25 , 2024 | 09:07 PM

తల్లి కోడి తన పిల్లలను కాపాడినట్టు తెలంగాణను కాపాడానని బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ అన్నారు.

హైదరాబాద్: తల్లి కోడి తన పిల్లలను కాపాడినట్టు తెలంగాణను కాపాడానని బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ అన్నారు. ‘‘ భువనగిరిలో బస్వాపూర్ ప్రాజెక్టు పూర్తి చేసుకున్నాం. ప్రాజెక్టుల నుంచి పంటలకు నీళ్లు ఇవ్వకుండా పంటలు ఎండబెట్టారు. రైతుబంధు ఇవ్వలేదు... రైతు భీమా ఉంటుందో లేదో. మిలర్ల దగ్గర కమీషన్ దొబ్బారు...రైతులకు మంచి ధరకు కొనుగోలు చేయడం లేదు. కాంగ్రెస్ వచ్చాక రాత్రి పూట కరెంట్‌తో రైతులు చనిపోతున్నారు. నాలుగు గంటల్లో రైతు ఆత్మహత్యల వివరాలు పంపించినా పట్టించు కోలేదు’’ అని అన్నారు. లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా యాద్రాద్రిలో ఆయన మాట్లాడారు.


‘‘ 1956 నుంచి మనకు శత్రువే కాంగ్రెస్ పార్టీ. ఆ పార్టీతోనే నష్టం’’ అని కేసీఆర్ అన్నారు. యాదాద్రి దేవాలయం అద్భుతంగా చేసినా ఓట్ల కోసం వాడుకోలేదని కేసీఆర్ అన్నారు. భువనగిరిలో బీఆర్‌ఎస్ బీ-టీం అంటున్నారని మండిపడ్డారు. మోదీ ప్రధాని కాగానే 400 మెగావాట్ల సీలేరు ప్రాజెక్టు తీసుకెళ్లి ఏపీలో కలిపారని మండిపడ్డారు. మోదీ లేకున్నా, ఏ పార్టీ ఉన్నా తెలంగాణ బాగుపడేదని అన్నారు.

Updated Date - Apr 25 , 2024 | 09:19 PM

Advertising
Advertising