TS NEWS: రాజేంద్రనగర్‌లో నార్కోటిక్ బ్యూరో సోదాలు
ABN, Publish Date - Jan 18 , 2024 | 09:11 PM
జేంద్రనగర్‌లో తెలంగాణ యాంటీ నార్కోటిక్ బ్యూరో అధికారులు సోదాలు చేశారు. ఫెంటనాయిల్ అనే నిషేధిత డ్రగ్స్‌ను ఓ వైద్యుడు అమ్ముతున్నట్లు అధికారులకు సమాచారం అందడంతో రంగంలోకి దిగి తనిఖీలు చేశారు. సమీర్ హాస్పిటల్‌లో అనిస్థిషియా వైద్యుడుగా ముస్తఫా పనిచేస్తున్నారు.
హైదరాబాద్: రాజేంద్రనగర్‌లో తెలంగాణ యాంటీ నార్కోటిక్ బ్యూరో అధికారులు సోదాలు చేశారు. ఫెంటనాయిల్ అనే నిషేధిత డ్రగ్స్‌ను ఓ వైద్యుడు అమ్ముతున్నట్లు అధికారులకు సమాచారం అందడంతో రంగంలోకి దిగి తనిఖీలు చేశారు. సమీర్ హాస్పిటల్‌లో అనస్థీసియా వైద్యుడుగా ముస్తఫా పనిచేస్తున్నారు. ఈ డ్రగ్ హెరాయిన్ కంటే 50 రెట్లు.. మార్ఫిన్‌కు 100 రెట్లు ఎక్కువ ప్రమాదమని అధికారులు హెచ్చరించారు. ఈ పోర్టర్ యాప్ ద్వారా ఇతరులకు డాక్టర్ దంపతులు సప్లై చేస్తున్నట్లు గుర్తించినట్లు అధికారులు తెలిపారు.
ఒక్కో బాక్స్ ఇంజెక్షన్లను 17500 రూపాయలకు వైద్య దంపతులు అమ్ముతున్నారు. నెల రోజుల పాటు వైద్యుడిపై నార్కోటిక్ అధికారులు నిఘా పెట్టారు. కొద్ది రోజుల క్రితం వైద్యుడు ముస్తఫా కువైట్ పారిపోయాడని... అతని భార్య నజీబ్ ఖాన్‌ను అదుపులోకి తీసుకుని విచారించినట్లు పోలీసులు తెలిపారు. ముస్తఫా ఇంట్లో సోదాలు చేసి 57 ఇంజెక్షన్లను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. నిందితుల నుంచి 6 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నారు. ఇంజక్షన్‌కు బానిస అయినా వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
Updated Date - Jan 18 , 2024 | 10:27 PM