ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

40 సంవత్సరాల నమ్మకం నిలుపుకుంటూ రమణీయమైన వివాహ వేడుకలు మీ ఇంట వెలిగేలా చేస్తున్న కాకతీయ మ్యారేజస్ తో మీ పేరు ఈరోజే నమోదు చేసుకోండి! ఫోన్|| 9390 999 999, 7674 86 8080

TS Politics: ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో నంద కుమార్ కీలక వ్యాఖ్యలు

ABN, Publish Date - Jan 18 , 2024 | 09:24 PM

ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో అరెస్ట్ అయినా నిందితుడు డెక్కన్ కిచెన్ హోటల్ యజమాని నంద కుమార్ ( Nandakumar ) కీలక వ్యాఖ్యలు చేశారు.

హైదరాబాద్: ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో అరెస్ట్ అయినా నిందితుడు డెక్కన్ కిచెన్ హోటల్ యజమాని నంద కుమార్ ( Nandakumar ) కీలక వ్యాఖ్యలు చేశారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ... తనకు జరిగిన అన్యాయంపై డీజీపీని కలిసి వినతిపత్రం ఇచ్చానని చెప్పారు. ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో అరెస్ట్ అయినా తర్వాత తనపై జరిగిన పరిణామాలపై రెండు ఫిర్యాదులు చేసినట్లు తెలిపారు. ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో అరెస్ట్ అయినా తర్వాత తన హోటల్‌ను అన్యాయంగా కూల్చివేశారని చెప్పారు. కోర్టు కేసు ఉన్న కూడా కోర్టు దిక్కరణకు పాల్పడ్డారన్నారు. జీహెచ్ఎంసీ అధికారులు రాజకీయ నాయకులు, తనకు అన్యాయం చేశారని ఆందోళన వ్యక్తం చేశాడు.

తన ఫోన్లోని ఆడియోలు బయటకు వచ్చాయని... తన ఫోన్‌ను టాంపరింగ్ చేశారని దీనిపై విచారణ జరిపించాలని కోరారు. టాస్క్‌ఫోర్స్ పోలీసులకు సంబంధం లేకున్నా తన హోటల్‌కు వచ్చి వేధింపులకు గురి చేశారని వాపోయాడు. ఎమ్మెల్యేల కొనుగోలు కేసు ప్రస్తుతం సుప్రీంకోర్టులో పెండింగ్‌లో ఉందని చెప్పారు. తనపై అనేక అక్రమ కేసులు పెట్టారని ఆవేదన వ్యక్తం చేశాడు. తనపై పీడీ యాక్ట్ నమోదు చేయాలని ప్లాన్ చేశారన్నారు. జీహెచ్ఎంసీ అధికారులకు ఎవ్వరు అనుమతులు ఇచ్చారో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. తనపై ఉన్న అక్రమ కేసులపై విచారణ జరిపించాలని కోరారు. డీజీపీకి అన్ని వివరాలు సమర్పించానని.. ఆయన సానుకూలంగా స్పందించారని నంద కుమార్ తెలిపారు.

Updated Date - Jan 18 , 2024 | 10:33 PM

Advertising
Advertising