ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

40 సంవత్సరాల నమ్మకం నిలుపుకుంటూ రమణీయమైన వివాహ వేడుకలు మీ ఇంట వెలిగేలా చేస్తున్న కాకతీయ మ్యారేజస్ తో మీ పేరు ఈరోజే నమోదు చేసుకోండి! ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Padmavibhushan: మెగాస్టార్ చిరంజీవికి శుభాకాంక్షలు తెలిపిన మంత్రి కోమటిరెడ్డి

ABN, Publish Date - Jan 26 , 2024 | 08:22 AM

హైదరాబాద్: కేంద్రం ప్రకటించిన పద్మవిభూషణ్ అవార్డుకు ఎంపికైన మెగాస్టార్ చిరంజీవికి మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు.

హైదరాబాద్: కేంద్రం ప్రకటించిన పద్మవిభూషణ్ అవార్డుకు ఎంపికైన మెగాస్టార్ చిరంజీవికి మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పునాదిరాళ్లు నుంచి ప్రారంభమైన చిరంజీవి ప్రస్థానం రేపటి ‘విశ్వంభర’ వరకు కొనసాగుతున్న సినీ ప్రస్థానం అని కొనియాడారు. రక్తదానం, నేత్రదానంతో కోట్లాది మంది గుండెల్లో ఆయన చిరస్థాయిగా నిలిచిపోయారన్నారు. చిరంజీవికి తెలంగాణ ప్రభుత్వం తరఫున మరోసారి శుభాకాంక్షలు తెలుపుతున్నానని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు.

రాజకీయాల్లో.. సినిమాల్లో.. ఇలా రెండు వేర్వేరు రంగాల్లో ఎలాంటి నేపథ్యమూ లేకుండా అతి సామాన్యులుగా ప్రస్థానాన్ని ప్రారంభించి, తమ స్వయంకృషితో, అద్భుత ప్రతిభతో అత్యున్నత స్థానాలకు ఎదిగిన ఇద్దరు అసామాన్యులైన తెలుగు తేజాలను పద్మవిభూషణ్‌ పురస్కారం వరించింది! వారిలో ఒకరు మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు కాగా.. మరొకరు తెలుగు చిత్రపరిశ్రమలో మెగాస్టార్‌గా వెలుగొందుతున్న చిరంజీవి. గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని.. 2024కుగాను పద్మ పురస్కారాలను కేంద్ర ప్రభుత్వం గురువారం రాత్రి ప్రకటించింది.

Updated Date - Jan 26 , 2024 | 08:22 AM

Advertising
Advertising